iDreamPost
android-app
ios-app

దేశంలో చెత్త ర‌హిత న‌గ‌రాలు – ఆంధ్రప్రదేశ్ నుండి ఆరు నగరాలకు స్థానం

  • Published May 20, 2020 | 8:58 AM Updated Updated May 20, 2020 | 8:58 AM
దేశంలో చెత్త ర‌హిత న‌గ‌రాలు – ఆంధ్రప్రదేశ్ నుండి ఆరు నగరాలకు స్థానం

2019-2020 సంవత్సరానికి 5 స్టార్ గా ఆరు న‌గ‌రాలు, 3 స్టార్‌గా 65 నగరాలు, 1 స్టార్‌గా 70 నగరాలను ధృవీకరించినట్లు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఈ జాబితాలో 3 స్టార్ న‌గ‌రాల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన రెండు న‌గ‌రాలు, 1 స్టార్ న‌గ‌రాల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన నాలుగు న‌గ‌రాలు ఉన్నాయి. ఈ రేటింగులకు సంబంధించి సవరించిన ప్రోటోకాల్‌ను కూడా మంత్రిత్వ‌ శాఖ ఆవిష్కరించింది. చెత్త రహిత హోదాను సాధించడానికి నగరాలకు ఒక యంత్రాంగాన్ని వ్యవస్థీకరంచడానికి, అధిక స్థాయి శుభ్రత పాటించేలా నగరాలను ప్రోత్సహించడానికి 2018 జనవరిలో మంత్రిత్వ శాఖ స్టార్ రేటింగ్ ప్రోటోకాల్‌ను ప్రారంభించింది.

కోవిడ్ సంక్షోభం కారణంగా పారిశుధ్యం, సమర్థవంతమైన ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ ప్రాముఖ్యత ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఐదేళ్ల క్రితం పట్టణ భారత్ కోసం వార్షిక పరిశుభ్రత సర్వే- స్వచ్ సర్వేక్షన్ (ఎస్ఎస్)ను కేంద్ర ప్ర‌భుత్వం ప్రవేశపెట్టింది. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెత్త రహిత నగరాల కోసం స్టార్ రేటింగ్ ప్రోటోకాల్‌ను రూపొందించింది. కేంద్ర నిర్ణ‌యించిన పరీక్షా విధానాల మాదిరిగానే ఒక సమగ్ర ఫ్రేమ్‌వర్క్, ఇక్కడ ప్రతి నగరంలోని ప్రతి వార్డు ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ 24 విభిన్న భాగాలలో ఒక నిర్దిష్ట ప్రమాణాన్ని సాధించాలి. మొత్తం మార్కులు ఆధారంగా గ్రేడ్ చేయబడింది.

కోవిడ్ సంక్షోభం వచ్చినప్పటి నుండి బహిరంగ ప్రదేశాలను ప్రత్యేకంగా శుభ్రపరచడం, నిర్బంధ గృహాల నుండి బయో-మెడికల్ వ్యర్థాలను సేకరించడం, పారవేయడం గురించి మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, నగరాలకు వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేసింది.

చెత్త ర‌హితంలో 5-స్టార్ రేటింగ్ న‌గ‌రాలు ఇవే..

అంబికాపూర్ (ఛ‌త్తీస్ గ‌ఢ్‌)
రాజ్‌కోట్ (గుజ‌రాత్‌)
సూర‌త్ (గుజ‌రాత్‌)
మైసూరు (క‌ర్ణాట‌క‌)
ఇండోర్ (మ‌ధ్య‌ప్ర‌దేశ్‌)
ముంబాయి (మ‌హారాష్ట్ర)

చెత్త ర‌హితంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ న‌గ‌రాలు ఇవే

తిరుప‌తి (3-స్టార్ రేటింగ్)
విజ‌య‌వాడ (3-స్టార్ రేటింగ్)
చీరాల (1-స్టార్ రేటింగ్‌)
విశాఖ‌ప‌ట్నం (1-స్టార్ రేటింగ్‌)
ప‌ల‌మ‌నేరు (1-స్టార్ రేటింగ్‌)
స‌త్తెన‌ప‌ల్లి (1-స్టార్ రేటింగ్‌)