iDreamPost
iDreamPost
సంక్రాంతి రిలీజ్ డేట్ల వ్యవహారం కొత్త మలుపులు తీసుకుంటోంది. ఆర్ఆర్ఆర్ ప్రభావం ఇతర సినిమాల మీద మాములుగా లేదు. ఇప్పటికే భీమ్లా నాయక్ నానా రచ్చ చేస్తుండగా రాధే శ్యామ్ కూడా గట్టి పోటీకి సై అంటోంది. ఈ నేపథ్యంలో వీటి మధ్య నలగడం ఎందుకనుకున్న గంగూబాయి కటియవాడి రేస్ నుంచి తప్పుకుంది. ఫిబ్రవరి 18న థియేటర్లలోకి రాబోతున్నట్టు నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ అధికారికంగా ప్రకటించింది. ఆర్ఆర్ఆర్ లోనూ ఇది పార్ట్ నర్ అన్న సంగతి మర్చిపోకూడదు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్ స్టార్ డ్రామా ఒక లేడీ డాన్ నిజ జీవిత కథ ఆధారంగా రూపొందించారు.
ముందు చెప్పిన డేట్ జనవరి 6. కేవలం ఒక్క రోజు గ్యాప్ లో ఆర్ఆర్ఆర్ తో క్లాష్ అవ్వడం ఏంటని ట్రేడ్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఫైనల్ గా ఇప్పుడు పోస్ట్ పోన్ తప్పలేదు. ఒకవేళ రాజమౌళి ఏదైనా కారణం వల్ల మళ్ళీ వాయిదా వేసుకుంటారేమో అని ఎదురు చూశారు కాబోలు. ఇక తప్పదనుకుని చెప్పేశారు. గంగూబాయి మీద కూడా అంచనాలు మాములుగా లేవు. అలియా భట్ టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమా ట్రైలర్ వచ్చాక హైప్ పెరిగింది. ప్రత్యేకించి హీరో లేకపోయినా స్టార్ కంటెంట్ ఉండటంతో నార్త్ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు మార్కెట్ లో అంతగా ప్రభావం ఉండదు కాబట్టి మనకు ఎప్పుడు వచ్చినా ఒకటే.
ఇక పాన్ ఇండియా లెవెల్ లో చూసుకుంటే సంక్రాంతికి యుద్ధం ఆర్ఆర్ఆర్ రాధే శ్యామ్ ల మధ్యే ఉండబోతోంది. ఒకవేళ భీమ్లా నాయక్ వచ్చినా దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ కే పరిమితమవుతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. ఎటొచ్చి ఏపి తెలంగాణలలో మాత్రం థియేటర్ల కొరత వచ్చేలా ఉంది. ముఖ్యంగా బిసి సెంటర్స్ లో స్క్రీన్స్ తక్కువగా ఉంటాయి. మూడు సినిమాలకు పంచడం అంత సులభం కాదు. ఇవి చాలదన్నట్టు బంగార్రాజు కూడా వస్తా అంటున్నాడు. సో పోటీ మాములు రసవత్తరంగా ఉండేలా కనిపించడం లేదు. ముందు ముందు ఇంకెన్ని వాయిదాలు మార్పులు వినాల్సి వస్తుందో. వెయిట్ అండ్ సి
Also Read : Pushpa : ‘పుష్ప’లో సమంత ఐటెం సాంగా.. ఇంకేమన్నా ఉందా?