iDreamPost

గద్దర్ కూతురికి టికెట్.. కాంగ్రెస్ వ్యూహం ఫలించేనా?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ఖరారు చేసింది. ఇక కాంగ్రెస్, బీజేలు పార్టీలు ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ఖారు చేయడంలో ఆలస్యం అవుతూ వచ్చాయి.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ఖరారు చేసింది. ఇక కాంగ్రెస్, బీజేలు పార్టీలు ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ఖారు చేయడంలో ఆలస్యం అవుతూ వచ్చాయి.

గద్దర్ కూతురికి టికెట్.. కాంగ్రెస్ వ్యూహం ఫలించేనా?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంది. ఇప్పటికే అధికార పార్టీ బీఆర్ఎస్ తమ ఎమ్మెల్యే అభ్యర్థులను కేటాయించి, బీ-ఫారాలు కూడా ఇచ్చారు. కానీ ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ మాత్రం అభ్యర్థుల ఎంపిక విషయం ఆలస్యం చేస్తూ వస్తున్నార. దీంతో తాము ఆశించిన సీట్లు వస్తాయో.. రావో అన్న టెన్షన్ లో ఆశావాహులు తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఇటీవల కాంగ్రెస్ 55 మంది అభ్యర్థులతో కూడిన జాబితా రిలీజ్ చేసింది. నిన్న మరో 45 మంది జాబితా రిలీజ్ చేసింది. ఇక బీజేపీ విషయానికి వస్తే మొన్నామధ్య 52 మంది అభ్యర్థుల జాబితా రిలీజ్ చేసి.. నిన్న ఒక్క అభ్యర్థికి సంబంధించిన లీస్ట్ రిలీజ్ చేసింది. మొత్తానికి కాంగ్రెస్ వందమంది అభ్యర్థుల లీస్ట్ ఖారారు చేసింది.. మరో 19 మంది అభ్యర్థుల జాబితా త్వరలో విడుదల చేయబోతున్నాం అని ప్రకటించింది. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ కి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాల వ్యూహాలను అమలు చేస్తూ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన రెండో లీస్ట్ లో ప్రజా యుద్దనౌక గద్దర్ కూతురు డాక్టర్ జీవీ వెన్నెలకు సీటు దక్కింది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ఎస్ కి గట్టిగా ఢీ కొట్టేందుకు అన్ని రకాల వ్యూహాలతో తెలంగాణ కాంగ్రెస్ ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే తెలంగాణల వ్యాప్తంగా పలువురు కీలక నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రజాయుద్ద నౌక దివంగత గద్దర్ కూతురు డాక్టర్ జీవి వెన్నలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటు ఇచ్చింది. ఈ మేరకు నిన్న రిలీజ్ చేసిన 45 మంది లీస్టులో ఆమె పేరును కన్ఫామ్ చేశారు. తెలంగాణలో తన పాటలతో కోట్ల మంది ప్రజలను జాగృతం చేసిన ప్రజా గాయకుడు గద్దర్ అంటే తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎంతో అభిమానం. చనిపోయే ముందు గద్దర్ రాజకీయాల వైపు మొగ్గు చూపడం.. కాంగ్రెస్ తో కలిసి ఎక్కువగా తిరగడం తెలిసిందే. పలు సందర్భాల్లో రాహుల్ గాంధీ వస్తే ప్రత్యేకంగా కలిశారు. ఆ సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారం కూడా జరిగింది. అనుకోకుండా గుండెపోటుతో గద్దర్ కన్నుమూశారు. టీపీసీసీ రేవంత్ రెడ్డి దగ్గరుండి మరీ అంత్యక్రియలు ఏర్పాటు చేశారు. ఆ సందర్బంగా ఆయన కుటుంబానికి ఈ ఎన్నికల్లో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఇటీవల రాహుల్ గాంధీ.. గద్దర్ కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇస్తే పోటీ చేస్తానని గద్దరు కూతురు వెన్నెల స్పష్టం చేశారు. అయితే అప్పట్లో హామీ ఇచ్చినప్పటికీ.. మొదటి లీస్ట్ లో ఆమె పేరు రాలేదు. నిన్న రిలీజ్ చేసిన 45 మంది అభ్యర్థుల జాబితాలో ఆమెకు చోటు దక్కింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటు కేటాయించారు. ఇదిలా ఉంటే.. గద్దర్ కూతురుకి టికెట్ ఇవ్వడంలో కాంగ్రెస్ పెద్ద ప్లానే వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ కి చెక్ పెట్టేందుకు సరైన అభ్యర్థు వేటలో ఉన్నారు. తెలంగాణలో గద్దర్ కి గొప్ప పేరు ఉంది.. ప్రతి పల్లె.. పట్నంలో ఆయన పాటలు మారుమోగుతూనే ఉంటాయి. ఆయన మరణం తర్వాత కుటుంబానికి ఎంతో సానుభూతి లభించింది. ఇది ఆయన కూతురు వెన్నెలకు మంచి ప్లస్ అవుతుందని భావించారు.

కాంగ్రెస్ పార్టీ వెన్నెలకు సీటు కేటాయించడం వెనుక మరో వ్యూహం కూడా ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఆమె పోటీ చేస్తున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత పోటీ చేస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ సాయన్న సెంటిమెంట్ ని ఉపయోగించుకోవాలని పక్కా ప్లాన్ తో ఆయన కూతురు లాస్యకు సీటు ఇచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ఆ వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు గద్దర్ కూతురు వెన్నెలను పోటీలో దింపుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గద్దర్ చనిపోయిన తర్వాత ఆయనపై ఉన్న సానుభూతి, మహిలకు ప్రాధాన్యత ఇవ్వడం లాంటివి చేయడంతో బీఆర్ఎస్ కి చెక్ పెట్టేలా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో కాంగ్రెస్ పెద్దలు ముందుకు సాగుతున్నారు. మరి సికింద్రాబాద్ కంటోన్మెంట్ సెంటిమెంట్, సానుభూతి ఎంత వరకు వర్క్ ఔట్ అవుతాయో ముందు ముందు చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి