రాజకీయ నాయకులు ప్రజలతో మమేకవుతూ, వారి సమస్యలు తెలుసుకుంటారు. అలానే ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విరుచుకపడుతుంటారు. తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. అయితే ఇలా వారు పాల్గొన్న పలు సభలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, డెమొక్రటిక్ అజాద్ పార్టీ అధ్యక్షుడు గులాం నబీ అజాద్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇస్లాం మతం కంటే హిందూ మతం పూరతనమైనదని నబీ ఆజాద్ అన్నారు. భారత్ లో ప్రస్తుతం నివసిస్తున్న ముస్లింలు మొదట హిందువులే అని, తరువాత మతం మారారని అన్నారు. ఆయన ప్రసంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జమ్ముకశ్మీర్ లోని దోడా జిల్లాలోని థాత్రి అనే ప్రాంతంలో గులాం నబీ అజాద్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..” ఇస్లాం మతం సుమారు 1500 ఏళ్ల క్రితం ఆవిర్భవించింది. కానీ హిందూ మతం అంతకంటే ముందు నుంచే ఉంది. కొందరు ముస్లింలు బయటి దేశాల నుంచి వలస వచ్చి మొఘల్ సైన్యంలో చేరి ఉండొచ్చు. కానీ భారత్ లో ఎక్కువగా హిందూ మతం నుంచే ఇస్లాంలోకి మత మార్పులు జరిగాయి. భారత్ లో ప్రస్తుతం నివసిస్తున్న ముస్లింలు మొదట హిందువులే, తరువాత మతం మారారు. కేవలం 10-20 మంది ముస్లింలు మాత్రమే బయటి దేశాల నుంచి వచ్చారు. మీకు చేరని అనేక సమస్యలను నేను పార్లమెంటులో ప్రస్తావించాను.
ఓ భాజపా నేత బయటి వ్యక్తుల రాక గురించి ప్రస్తావించారు. కానీ ఇక్కుడున్న వారంతా బయటి వ్యక్తులు కాదని స్పష్టం చేశాను’’ అని ఆయన అన్నారు. భారతదేశంలో మతాల, చారిత్రక నేపథ్యాలపై చేసిన ఈ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. ఆయన ప్రసంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక గులాం నబీ అజాద్ విషయానికి వస్తే.. ఆయన చాలా ఏళ్ల పాటు కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్నారు. అలానే యూపీఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా కూడా పని చేశారు. ఇక రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సమయంలో ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. అనంతరం సొంతంగా డెమొక్రటిక్ అజాద్ పార్టీని స్థాపించారు.
Former Congress leader Ghulam Nabi Azad-
Hindu Religion is much older than Islam in India. Muslims in our country are because of Conversion from Hindus and in Kashmir all Muslims were converted from Kashmiri Pandits. Everybody is born in Hindu Dharma only. pic.twitter.com/trWqUyFzrs
— Megh Updates 🚨™ (@MeghUpdates) August 16, 2023
ఇదీ చదవండి: వీడియో: ఆరు నెలల బిడ్డతో మంత్రి పాదాలపై RTC డ్రైవర్..