iDreamPost
android-app
ios-app

forbes- akshay kumar తిట్టుకున్న హీరోదే ప్రపంచ రికార్డు

  • Published Aug 24, 2022 | 5:48 PM Updated Updated Aug 24, 2022 | 5:48 PM
  • Published Aug 24, 2022 | 5:48 PMUpdated Aug 24, 2022 | 5:48 PM
forbes- akshay kumar  తిట్టుకున్న హీరోదే ప్రపంచ రికార్డు

ముందు వెనుకా కథలు చూసుకోకుండా వరసగా సినిమాలు చేస్తుంటాడని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ని టార్గెట్ చేసేవాళ్ళు సోషల్ మీడియాలో లక్షల్లో ఉన్నారు. దానికి తగ్గట్టే మనోడు నెంబర్ అయితే ఘనంగా ఉంటుంది కానీ దానికి తగ్గ క్వాలిటీ మాత్రం కంటెంట్ లో ఉండదు. ఇటీవలే వచ్చిన రక్షా బంధన్, భారీ బడ్జెట్ తో యష్ రాజ్ సంస్థ తీసిన సామ్రాట్ పృథ్విరాజ్, గద్దలకొండ గణేష్ రీమేక్ గా రూపొందిన బచ్చన్ పాండే ఒకదాన్ని మించి మరొకటి బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టిన కళాఖండాలు. వచ్చే నెల మొదటి వారంలో రాక్షసుడు రీమేక్ కట్ పుత్లీ నేరుగా హాట్ స్టార్ ఓటిటిలో రానుంది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్.

మరి ప్రపంచ రికార్డు దేనికి అనుకుంటున్నారా. సుప్రసిద్ధ ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం అక్షయ్ కుమార్ కు ప్రపంచంలో అత్యధికంగా సంపాదన చేస్తున్న రెండో నటుడిగా గుర్తింపు దక్కింది సగటున 48.5 మిలియన్ డాలర్లతో ఏకంగా బ్రాడ్ పిట్, విల్ స్మిత్ లాంటి హాలీవుడ్ సెలబ్రిటీలను దాటేసి మరీ సెకండ్ ర్యాంక్ అందుకున్నాడు. మరో విశేషం ఏంటంటే ఆ పత్రిక విడుదల చేసిన లిస్టులో ఒకే ఒక్క భారతీయ యాక్టర్ కూడా అక్షయ్ కుమారే కావడం గమనార్హం. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా చూస్తే ఆ జాబితాలో అక్షయ్ కుమార్ 52వ ప్లేస్ లో ఉన్నాడు. చూశారా వరసగా సినిమాలు చేయడం ద్వారా అక్షయ్ కుమార్ కేవలం కౌంట్ పెంచుకోవడం ఒకటే చేయడం లేదనే క్లారిటీ వచ్చిందిగా.

దీన్నే అక్షయ్ ఫ్యాన్స్ ఆన్ లైన్ లో ఆనందంగా పంచుకుంటున్నారు. నిజానికి అతని సబ్జెక్టు సెలక్షన్ బాగానే ఉన్నప్పటికీ దర్శకులు వాటిని హ్యాండిల్ చేయడంలో చేస్తున్న తప్పుల వల్ల దెబ్బ తింటున్నాయి. పైగా ఎక్కువ రీమేక్స్ చేయడం కూడా ప్రభావం చూపిస్తోంది. ఆ మధ్య కాంచనని హిందీలో లక్ష్మి బాంబ్ గా తీసి తీవ్ర విమర్శలు అందుకున్నాడు. ఆస్కార్ కు వెళ్లినంత పని చేసిన సూర్య ఆకాశం నీ హద్దురాని ఇప్పుడు బాలీవుడ్ కు అందించే పనిలో ఉన్నాడు. సంవత్సరంలో కనీసం నాలుగైదు సినిమాలు రిలీజయ్యేలా ప్లాన్ చేసుకుంటున్న అక్షయ్ కుమార్ కు దగ్గరలో ఇంకెవరూ లేరు. ఎంత చెట్టుకు అంత గాలి ఎంత పనికి అంత సంపాదనని పెద్దలు ఊరికే అనలేదు

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom