iDreamPost

HYDలోని ఆల్ఫా హోటల్‌లో పాడైపోయిన మటన్‌తో బిర్యానీ.. తిన్నారంటే హాస్పిటల్ కే!

  • Published Jun 20, 2024 | 11:09 AMUpdated Jun 20, 2024 | 11:09 AM

గత కొన్ని రోజులుగా నగరంలోని ఆహార పదార్థాలలు విక్రయింపులో కనిపిస్తున్న దారుణాలు చూస్తుంటే.. అసలు బయట తినాలంటనే వణుకు పుడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే గత కొన్ని రోజపులుగా పలు హోటల్స్ లో సోదాలు నిర్వహించగా.. తాజాగా ఇప్పుడు జంట నగరాల్లో ఫేమస్ అయిన సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ లో ఫుడ్ సెఫ్టీ, టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అయితే అక్కడ కూడా పలు దారుణమైన దృశ్యలు వెలుగులోకి వచ్చాయి.

ప్రస్తుతం ఫుడ్ లవర్స్ కు బయట తినడం కన్నా ఇంట్లో గెంజి నీళ్లు తాగడం మేలు అనేట్టుగా ఏర్పడింది వాతవరణం. ఎందుకంటే..ఇటీవల కాలంలో బయట తయారు చేస్తున్న ఫుడ్స్ విషయంలో ఎన్ని దారుణాలు చోటు చేసుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా గత కొన్ని రోజుల వరకు ఆన్ లైన్ ఫుడ్ ల ఆరాచకాలు వెలుగులోకి వస్తున్న తరుణంలో.. ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్ హోటల్స్, రెస్టారెంట్స్ లోని తనీఖీలు నిర్వహించడంతో.. ఊహించని దారుణలు బయటపడుతున్నాయి. ఇక ఈ విషయానికొస్తే.. నగరంలో గత కొన్ని రోజులుగా వరుసగా ఫుడ్ సెప్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా సికింద్రాబాద్ లోని ప్రముఖ స్టార్ హోటల్ లో కూడా ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అయితే అక్కడ కూడా కొన్ని దారుణమైన దృశ్యులను గుర్తించారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

గత కొన్ని రోజులుగా నగరంలోని ఆహార పదార్థాలలు విక్రయింపులో కనిపిస్తున్న దారుణాలు చూస్తుంటే.. అసలు బయట తినాలంటనే వణుకు పుడుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చిన్నా చితకా హోటళ్లు, రెస్టారెంట్స్ నుంచి స్టార్ హోటల్స్ వరకు పరిశుభ్రత లేని ఆహార పదార్థాలను తయారుచేసి విక్రయిస్తున్నారు. ఏమాత్రం నాణ్యత లేని కాలం చెల్లిన వస్తువులతో ఆహారం తయారు చేసి ప్రజల ప్రాణలతో వ్యాపారం చేస్తున్నారు.ఇప్పటికే నగరంలో పలు హోటల్స్ లో సోదాలు నిర్వహించగా.. తాజాగా ఇప్పుడు జంట నగరాల్లో ఫేమస్ అయిన సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ లో ఫుడ్ సెఫ్టీ, టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు.

ఇక ఈ దాడుల్లో కొన్ని దారుణమైన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఈ హోటల్ లో కూడా నాసిరకం వస్తువులతో పాటు, కిచెన్ లో ఏమాత్రం పరిశుభ్రత లేనట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా..పాడైపోయిన మటన్‌తో బిర్యాని తయారుచేసి వండిపెడుతున్నట్లు తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది. ఇక ఫుడ్ తయారుచేసి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుతూ.. ఆర్డర్ల మేరకు అప్పటికప్పుడు వేడి చేసి కస్టమర్లకు అందిస్తున్నట్లు గుర్తించారు.అలాగే ఆల్ఫా హోటల్ నిర్వహకులు స్వయంగా తయారు చేసే బ్రెడ్‌తో పాటు ఐస్‌క్రీమ్, టీ పొడి కూడా నాసిరకంగా ఉన్నట్లు గుర్తించారు.

ముఖ్యంగా.. బ్రెడ్, ఐస్‌క్రీమ్, టీ పొడి డేటు, బ్యాచ్ లేకుండా తయారు చేసి విక్రయాలు చేస్తున్నారు. అలాగే కిచెన్ మొత్తం అపరిశుభ్రంగా ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులు వెల్లడించారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆల్ఫా హోటల్‌పై కేసు నమోదు చేయటంతో పాటు రూ. 1 లక్ష ఫైన్ విధించినట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు వెల్లడించారు. కాగా, గతంలో కూడా ఆల్ఫా హోటల్‌పై అధికారులు దాడులు నిర్వహించారు. కాగా, అక్కడి దారుణ పరిస్థితులు చూసి హోటల్‌ను సీజ్ కూడా చేశారు. మళ్లీ ఇటీవలే తిరిగి ఓపెన్ కాగా.. మరోసారి హోటల్ నిర్వాహకుల దారుణాలు వెలుగులోకి వచ్చాయి. మరి, ప్రముఖ అల్ఫా హోటల్ లో వెలుగులోకి వచ్చిన ఈ భయంకరమైన దృశ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి