iDreamPost
android-app
ios-app

22 మంది ప్ర‌యాణికుల‌తో నేపాల్ విమానం మిస్సింగ్.. పర్వతాల్లో కూలిపోయి.. అందులో భారతీయులు కూడా..

  • Published May 29, 2022 | 6:19 PM Updated Updated May 29, 2022 | 6:19 PM
22 మంది ప్ర‌యాణికుల‌తో నేపాల్ విమానం మిస్సింగ్.. పర్వతాల్లో కూలిపోయి.. అందులో భారతీయులు కూడా..

నేపాల్‌లో తారా ఎయిర్ 9 NAET ట్విన్-ఇంజిన్ విమానం సడెన్ గా తప్పిపోయింది. 22 మంది ప్ర‌యాణికుల‌తో ప్ర‌యాణిస్తున్న ఈ విమానం ఆచూకీ దొర‌క‌డం లేదు. ఇవాళ(మే 29) ఉదయం పోఖ్రా నుంచి జోమ్‌సోమ్‌కు బయల్దేరిన విమానం కొద్ది సేపటి త‌ర్వాత ఏటీసీతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయ‌ని అధికారులు చెప్తున్నారు.

ముస్తాంగ్ జిల్లాలోని జోమ్సోమ్ ప్రాంతంలో మొద‌ట‌ గుర్తించామ‌ని ఆ త‌ర్వాత‌ మౌంట్ ధౌలగిరి వైపు మళ్లింద‌ని విమాన అధికారులు తెలిపారు. త‌ర్వాత మాత్రం త‌మ‌తో ట‌చ్‌లో లేకుండా పోయింద‌ని అన్నారు. అయితే ధౌలగిరి పర్వతాల్లో కూలిపోయిందని అంతా అనుకున్నారు. అనుకున్నట్టే ఆ పర్వతాల్లో కోవాంగ్ గ్రామ సమీపంలో కూలినట్టు నేపాల్ ఆర్మీ అధికారులు చెప్తున్నారు.

విమాన శకలాలని ధౌలాగిరి పర్వతాల్లో గురించమని ఆర్మీ అధికారులు తెలపడంతో అటు వైపుగా వెళ్లి వెతకడం మొదలు పెట్టారు. ఈ విమానంలో 22 మంది ప్ర‌యాణికులు ఉండగా అందులో న‌లుగురు భార‌తీయులు, ముగ్గురు జ‌పాన్ పౌరులు, మిగితా వారంద‌రూ నేపాల్ పౌరులు ఉన్నారు. నేపాల్ లో విమానం కూలిపోవడంతో అంతర్జాతీయంగా దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ఇంకా ఆ విమానంలోని ప్రయాణికుల సంగతి ఏంటి అనే వివరాలు బయటకు రాలేదు.