iDreamPost
android-app
ios-app

BREAKING: బెంగుళూరులో భారీ అగ్ని ప్రమాదం.. 40 బస్సులు దగ్ధం!

బెంగుళూరులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో సుమారు 40 బస్సులో దగ్దమైనట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి.

బెంగుళూరులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో సుమారు 40 బస్సులో దగ్దమైనట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి.

BREAKING: బెంగుళూరులో భారీ అగ్ని ప్రమాదం.. 40 బస్సులు దగ్ధం!

బెంగుళూరులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోని వీరభద్ర నగర్ లోని ఓ గ్యారేజీలో పెద్ద ఎత్తున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే రెండు అగ్నిమాపక యంత్రాలతో మంటలు ఆర్పివేసినా మంటలు అదుపులోకి రాలేదు. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఆ మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు కష్టపడుతున్నారు.

ఈ ప్రమాదంలో సుమారుగా 40 బస్సులు మంటల్లో దగ్దమైనట్లుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ గ్యారేజీలో బస్సులు పక్క పక్కనే పార్క్ చేసి ఉండడంతో మంటలు మరింత వ్యాపించాయని సిబ్బంది అభిప్రాయ పడుతున్నారు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయందోళనలకు గురయ్యారు. ఈ ప్రమాదంతో భారీగానే ఆస్తి నష్టం సంభవించినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ భారీ అగ్ని ప్రమాదానికి అసలు కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి.

Jojobet GirişMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobetJojobet