నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అగ్నిప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. షార్ట్ సర్క్యూట్, రసాయనాల పేలుడు వంటి ఇతర కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ఈ ప్రమాదాల్లో అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. వాహనాలు కూడా తరచూ అగ్నిప్రమాదలకు గురవుతున్నాయి. ఇటీవలే హైదరాబాద్ లోని కూకట్ పల్లి ప్రాంతంలో ఓ ప్రైవేటు బస్సు నడి రోడ్డుపై కాలిపోయింది. తాజాగా కూడా ఓ బస్సు నడి రోడ్డుపై కాలి బుడిదైంది. అందులోని ప్రయాణికులు రెప్పపాటులో ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయట పడ్డారు. ఈ ఘటన అర్జెటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అర్జెటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ సిటీలో బుధవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి 22 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో చూసినట్లైతే నడి రోడ్డుపై వెళ్తున్న ఒక బస్సులో మంటలు వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్.. బస్సును పక్కకు తీసుకెళ్లి.. ఆపాడు. అనంతరం అందులోని ప్రయాణికులు క్షణాల్లో బయటకు పరుగులు తీశారు. ఇక మంటలు బస్సు అంతటా వ్యాపించాయి. చూస్తు ఉండగానే బస్సు అంత మంటల్లో కాలిపోయింది. అలానే బస్సులోని ఇంధనం రోడ్డుపై పడటంతో నడి రోడ్డుపైకి కూడా మంటలు వ్యాపించాయి.
అటుగా వెళ్తున్న ఓ కారు.. తృటిలో తప్పించుకుంది. భారీగా మంటలు వ్యాపించడంతో ఆ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. కొన్ని గంటల పాటు ఆ ప్రాంతమంతా నల్లటి పొగలు కమ్ముకున్నాయి. స్థానికులు అందించిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Watch a bus catch on fire in Argentina #bus #busfire #argentina pic.twitter.com/qxLlALdHFp
— UpToDate (@UpToDateNewsSvc) August 16, 2023
ఇదీ చదవండి: ఈటీజీ టైమ్స్ నౌ సర్వేలో YSRCP ప్రభంజనం.. 25 లోక్ సభ స్థానాలు!