ప్రభుత్వ రంగ బ్యాంకుల చార్జీలను పెంచబోమని కేంద్రం స్పష్టం చేసింది.బ్యాంక్ ఆఫ్ బరోడా డిపాజిట్, విత్డ్రాయెల్స్పై నిర్ణీత పరిమితి దాటిన తర్వాత చార్జీలు వసూలు చేస్తామని ప్రకటించడంతో బ్యాంకు సర్వీస్ చార్జీలు పెరగనున్నాయన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఆర్థిక శాఖ బ్యాంకు సర్వీస్ చార్జీల విషయంలో క్లారిటీ ఇచ్చింది. బ్యాంకు సర్వీస్ చార్జీలను పెంచబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని వెల్లడించింది.
జన్‌ధన్ ఖాతాలతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్న బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్లపై ఎలాంటి సర్వీస్ చార్జీల పెంపు ఉండదని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా ప్రతికూల సమయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు సర్వీస్ చార్జీలను పెంచవని కేంద్ర ఆర్థిక శాఖ భరోసా ఇచ్చింది. కాగా బ్యాంక్ బరోడా పెంచిన సర్వీస్ చార్జీలు నవంబర్ 1 నుండి అమల్లోకి వస్తాయని ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కూడా సర్వీస్ చార్జీలు పెంచబోతున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. వాటిని కొట్టి పడేస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎలాంటి సర్వీస్ చార్జీల పెంపు లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.