Krishna Kowshik
మానవతా విలువలు రోజు రోజుకూ తగ్గిపోతున్నాయి. నడి రోడ్డుపై ప్రమాదం జరిగితే.. మనుషులు చావు బతుకుల్లో ఉంటే.. సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటున్నారు కానీ సాయం చేయడం లేదు. దీంతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
మానవతా విలువలు రోజు రోజుకూ తగ్గిపోతున్నాయి. నడి రోడ్డుపై ప్రమాదం జరిగితే.. మనుషులు చావు బతుకుల్లో ఉంటే.. సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటున్నారు కానీ సాయం చేయడం లేదు. దీంతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
Krishna Kowshik
’మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు‘ అని కవి హృదయం ఆవేదన వ్యక్తం చేయగా.. అది అక్షర సత్యం అనిపించకమానదు నేటి సమాజంలోని వ్యక్తుల మనస్తత్వాలు చూస్తుంటే. డబ్బు సాయం కాదు కదా.. మాట సాయం చేసేందుకు కూడా వెనుకాడుతున్నారు. సమాజంలోని పరిస్థితులు, కొంత మంది వ్యక్తుల వల్ల మనిషి కఠినంగా మారిపోయాడని సమర్థించుకుంటున్నప్పటికీ స్వార్థంగా మారాడు. తను, తన కుటుంబం అదే ప్రపంచంగా బతికేస్తున్నాడు. ఎవ్వరూ ఎటు పోతే నాకేంటీ అన్న ధోరణి సుస్పష్టంగా కనిపిస్తోంది. గతంలో రోడ్డు మీద వెళ్లే వ్యక్తులు పడిపోయినా, ప్రమాదం జరిగినా.. ఏమైందని ఆరా తీసేవారు, సాయం చేసేవారు. కానీ నేడు.. సెల్ఫీలు తీసుకోవడం, చూసుకుంటూ వెళ్లిపోతున్నారే తప్ప, ఆపన్న హస్తం అందించే నాధుడు కరువయ్యారు.
రోడ్డుపై యాక్సిడెంట్ జరిగితే.. రక్తపు మడుగుల్లో ప్రమాదం జరిగిన వ్యక్తి కొట్టుమిట్టాడుతుంటే.. ఒక్కరు కూడా అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించలేదు సరికదా.. అతడి కెమెరాను దొంగిలించారు. సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకెళ్లకపోవడంతో అతడు మరణించాడు. ఈ అమానవీయ సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని పంచషీల్ ఎన్ క్లేవ్ వద్ద రెండు బైక్స్ ఢీ కొన్న ఘటనలో డాక్యమెంటరీ ఫిల్మ్ మేకర్ పీయూష్ పాల్ మృతి చెందాడు. స్విమ్మింగ్ క్లాసుల నుండి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. శనివారం రాత్రి ఈ ఘటన జరగ్గా.. మంగళవారం అతడు మరణించాడు. ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందగా.. సంఘటనా స్థలానికి చేరకుని.. ప్రాథమిక విచారణ చేపట్టారు.
ఇద్దరు బైకర్లలో ఒకరు పాల్ కాగా, రెండు బంటీ అని తేలింది. గురుగ్రామ్ లో పనిచేస్తున్న బంటీ బైక్ నడుపుతూ పాల్ మోటార్ సైకిల్ ఢీకొనడం సీసీటీవీ కెమెరాలో కనిపించింది. బంటీ వాంగూల్మాన్ని తీసుకున్న పోలీసులు.. పాల్ పై కేసు నమోదు చేశారు. అంతలో పాల్ చనిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. అయితే తన స్నేహితుడిపై కేసు నమోదు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశాడు పాల్ ఫ్రెండ్ బోస్. ఆ వీడియోలో తన ఫ్రెండ్ ఖరీదైన హెల్మెట్ ధరించాడని, రెండు బైకులు ఢీ కొన్నాక.. ఇద్దరు కిందపడిపోయారని.. తన ఫ్రెండ్ పాల్‌ను 20 నిమిషాల పాటు రక్తపు మడుగుల్లో పడి ఉండగా.. ఎవ్వరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదని చెప్పాడు.
కేవలం ఫోన్లలో ఫోటోలు తీసుకున్నారని, ఓ ముగ్గురు వ్యక్తులు ముందుకు వచ్చి.. సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. అరగంట తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లడంతో అతడె మరణించారని ఆవేదన వ్యక్తం చేశాడు బోస్. అతడిని సకాలంలో తీసుకెళ్లి ఉంటే బ్రతికి ఉండేవాడని అన్నారు. రాత్రి పది గంటల వరకు అతడి ఫోన్ మోగిందని, ఆ తర్వాత పనిచేయలేదని పేర్కొన్నారు. అలాగే తన డాక్యుమెంట్ ఫిల్మ్ కోసం కొన్న ఖరీదైన గో-ప్రో కెమెరాను కూడా ఎవరో కొట్టేశారని చెప్పారు. తాము ఎవరి నుండి పరిహారం కోరడం లేదని, తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. బాలీవుడ్ సినీ పరిశ్రమలోని టెక్నీషియన్లు, వాళ్లెలా జీవిస్తారు, వారి దినచర్యపై డాక్యుమెంట్ చేయాలన్నదీ పాల్ కల అంటూ తెలిపాడు.