iDreamPost
android-app
ios-app

దారుణం.. కన్నబిడ్డలపై క్షుద్రపూజలు.. చిన్నారి నోట్లో కుంకుమ పోసి..

  • Published Jun 15, 2022 | 6:58 PM Updated Updated Jun 15, 2022 | 6:58 PM
  • Published Jun 15, 2022 | 6:58 PMUpdated Jun 15, 2022 | 6:58 PM
దారుణం.. కన్నబిడ్డలపై క్షుద్రపూజలు.. చిన్నారి నోట్లో కుంకుమ పోసి..

కన్నతండ్రే తన పిల్లలను చంపేందుకు క్షుద్రపూజలు చేయించిన ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగుచూసింది. జిల్లాలోని పెద్దిరెడ్డిపల్లికి చెందిన వేణుకు పెళ్లైన 12 ఏళ్లకు పూర్విక – పునర్విక (4) ఇద్దరు కవల ఆడపిల్లలు జన్మించారు. ఏం జరిగిందో తెలీదు గానీ.. ఇద్దరు పిల్లలను ఇంట్లో కూర్చోబెట్టి క్షుద్రపూజలు చేశాడు. చిన్నపాప నోట్లో కుంకమపోసి గొంతునులిమాడు. ఈ క్రమంలో పిల్లలిద్దరూ పెద్దగా కేకలు పెట్టారు.

పిల్లల కేకలను గమనించిన స్థానికులు ఆ ఇంటికి వెళ్లి చూడగా తండ్రి చిన్నపాప గొంతునొక్కడం కనిపించింది. వెంటనే ఇద్దరినీ రక్షించి, చిన్న పాపను ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వస్తున్నట్లు తెలుసుకున్న వేణు పరారయ్యాడు. కన్నబిడ్డలను చంపేందుకు క్షుద్రపూజలు చేయడం స్థానికులను విస్మయానికి గురిచేసింది. కాగా.. వేణు శాంతి పూజల కోసం ఇలా చేశాడా ? లేక క్షుద్రపూజలు జరిపించాడా ? క్షుద్రపూజలే అయితే వేటికోసం చేశాడు ? అన్న విషయాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. పరారీలో ఉన్న వేణుకోసం పోలీసులు గాలిస్తున్నారు.

 

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş