iDreamPost
android-app
ios-app

మర్చిపోలేని విధంగా బన్నీకి ఫ్యాన్స్ ఘన స్వాగతం.. వైరల్ గా వీడియోస్!

  • Author ajaykrishna Updated - 09:02 AM, Thu - 19 October 23
  • Author ajaykrishna Updated - 09:02 AM, Thu - 19 October 23
మర్చిపోలేని విధంగా బన్నీకి ఫ్యాన్స్ ఘన స్వాగతం.. వైరల్ గా వీడియోస్!

తెలుగు ఇండస్ట్రీ నుండి నేషనల్ అవార్డు అందుకున్న ఫస్ట్ లీడ్ యాక్టర్ గా అల్లు అర్జున్ నయా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇటీవల అవార్డులు అనౌన్స్ చేయగా.. అక్టోబర్ 18న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుల ప్రదానం ఘనంగా జరిగింది. ఈ 69వ జాతీయ పురస్కార వేడుకలకు బన్నీ తన ఫ్యామిలీతో వెళ్లాడు. అటు బన్నీ పేరెంట్స్ కి, ఇటు అభిమానులకు ఇది ఎంతో ప్రౌడ్ మూమెంట్ అని చెప్పాలి. టాలీవుడ్ నుండి నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ కి.. హైదరాబాద్ లో ఫ్యాన్స్ నుండి ఘన స్వాగతం లభించింది. తమ అభిమాన హీరోని ఎంతో ఉత్సాహంగా.. గ్రాండ్ గా ఆహ్వాహించారు ఫ్యాన్స్.

ముఖ్యంగా బన్నీ ఇంటి వాతావరణంలో ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. 2021 ఏడాదికి గాను బన్నీ బెస్ట్ యాక్టర్ గా.. పుష్ప సినిమాకు అవార్డు కైవసం చేసుకున్నాడు. తెలుగు ఇండస్ట్రీకి దాదాపు పది అవార్డుల వరకు రాగా.. బెస్ట్ యాక్టర్ గా ఇప్పటిదాకా ఏ ఒక్కరికి రాలేదు. ఆ లోటును అల్లు అర్జున్ పుష్పరాజ్ గా తీర్చేశాడు. పుష్ప సినిమాలో బన్నీ నటన, యాటిట్యూడ్, డైలాగ్స్ అన్ని కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సుకుమార్ తెరకెక్కించిన ఈ యాక్షన్ మూవీ.. పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా నుండి వరల్డ్ వైడ్ సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు.

ఇక పుష్ప సినిమాకు గాను అవార్డు అందుకున్న బన్నీ.. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ చేస్తున్నాడు. మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్న పుష్ప.. మొదటి పార్ట్ బిగ్ సక్సెస్ కావడంతో.. సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుకుమార్ ఈసారి మరింత సాలిడ్ యాక్షన్ బ్లాక్స్ ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కాగా.. నేషనల్ అవార్డు అందుకొని ఇంటికి చేరుకున్న బన్నీపై పూల వర్షం కురిపిస్తూ గ్రాండ్ వెల్కమ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి అల్లు అర్జున్ టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న మొదటి హీరో. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş