iDreamPost
android-app
ios-app

సోనూసూద్ పై అభిమానం.. వినూత్నంగా చాటుకున్న తెలంగాణవాసి

సోనూసూద్ పై అభిమానం.. వినూత్నంగా చాటుకున్న తెలంగాణవాసి

లాక్ డౌన్ సమయంలో ఎందరికో సాయమందించి రియల్ హీరోగా నిలిచిన సోనూసూద్ కు దేశవ్యాప్తంగా అభిమానగణం భారీగా ఉంది. సమాజ సేవకుడు, బహు భాషా నటడు సోనూసూద్ కు ఆయన అభిమానులు మరో గుడి కట్టించారు. సమాజానికి సోనూసూద్ అందిస్తున్న సేవలను గౌరవిస్తూ తెలంగాణలోని ఖమ్మం జిల్లా గార్లపాడుకు చెందిన ఓ కుటుంబం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి అభిమానం చాటుకుంది. సిద్దిపేట జిల్లా దుబ్బతుండలో గత ఏడాది లో సోనూసూద్ కు ఆయన అభిమాని ఓ ఆలయం నిర్మించిన విషయం తెలిసిందే.

తాజాగా సోనూసూద్ సేవా కార్యక్రమాలతో స్ఫూర్తి పొందిన ఖమ్మం జిల్లా గార్లపాడుకు చెందిన గుర్రం వెంకటేశ్ ..తన నివాసంలోనే సోనూసూద్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే మంచి మనసున్న సోనూసూద్ విగ్రహాన్ని సొంతఖర్చులతో ప్రతిష్టించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

Also Read : డ్రగ్స్ నిజాలు బయటపెట్టిన ఎన్ఐఏ.. బాబూ, ఆయన బ్యాచ్ ఇప్పుడేమంటుందో..?  

కరోనా విజృంభణతో లాక్ డౌన్ విధించినప్పుడు వలసకార్మికుల కష్టాలు చూసి చలించిపోయిన సోనూసూద్ వారిని సొంతూళ్లకు పంపేందుకు రవాణా సౌకర్యం కల్పించారు. ఆపదలో ఉన్న వారికి తన ట్రస్ట్ ద్వారా సాయం అందిస్తూనే ఉన్నారు సోనూసూద్. సాధారణ ప్రజానీకంతో పాటు సెలబ్రిటీలు కూడా సోనూ ట్రస్ట్ ద్వారా సాయం పొందినవారిలో ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా సాయం అడిగిందే తడువుగా స్పందించే వారు.

పంజాబ్ వాస్తవ్యుడైన సోనూసూద్ మహారాష్ట్ర లో స్థిరపడిన తెలుగింటి అమ్మాయిని వివాహమాడారు. పలు తెలుగు సినిమాల్లో నటించిన సోనూసూద్.. తెలుగురాష్ట్రాల్లోని పలుకుటుంబాలకు సాయం అందించారు. అవసరమన్న వారికి నగదు సాయంతో పాటు ఉపాధిమార్గాలను కూడా చూపి పలువురి ప్రశంసలు అందుకున్నారు.

పన్నులు చెల్లించలేదనే కారణంతో ఆయనకు ఇటీవల ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. సోనూసూద్ ను ఐటీ అధికారులు పలు దఫాలుగా విచారించారు. సేవా కార్యక్రమాలు చేస్తున్న సోనూకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని పలు రాజకీయపార్టీలు చెప్పినట్లు ఆయన ఇటీవల వెల్లడించారు.

Also Read : త్వరలో ఇంటి నుంచే ఓటు వేయవచ్చు!