iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్ : ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ళ ఆత్మహత్య.. కారణం ఏంటి? కేసు నమోదు..

  • Published Jun 11, 2022 | 7:29 PM Updated Updated Jun 11, 2022 | 7:29 PM
బ్రేకింగ్ : ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ళ ఆత్మహత్య.. కారణం ఏంటి? కేసు నమోదు..

తాజాగా టాలీవుడ్, బాలీవుడ్ లో ఎంతోమందికి ఫ్యాషన్ డిజైనర్ గా పని చేసిన ప్రత్యూష గరిమెళ్ళ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసి టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు షాక్ కి గురయ్యారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యుష గరిమెళ్ళ డిజైనర్ గా ఎదిగి తన పేరుతోనే బొటిక్ ని స్థాపించి చాలా పెద్ద ఫ్యాషన్ డిజైనర్ గా ఎదిగింది. 2013 నుంచి ఫ్యాషన్ డిజైనర్ గా పని చేస్తుంది. కీర్తి సురేష్, రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొనే, శ్రద్ధాదాస్, కాజల్ , ఉపాసన, ప్రగ్య జైస్వాల్, కృతి కర్బందా…. ఇలా టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ కి ఎంతోమందికి డ్రెస్ లు డిజైన్ చేసింది.

ఇవాళ ఉదయం తన ఇంటినుంచి బంజారా హిల్స్ లోని తన బొటిక్ కి వచ్చింది. లోపలికి వెళ్లేముందు వాచ్ మెన్ తో డిస్టర్బ్ చేయకండి అని చెప్పి తన రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకుంది. మధ్యాహ్నం వరకు కూడా తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకి ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని తలుపులు పగలకొట్టుకొని లోపలి వెళ్లారు.

అక్కడ లోపల బాత్రూంలో విగత జీవిగా ప్రత్యూష పడి ఉండటం చూసారు. అప్పటికే మరణించిందని నిర్థారించారు పోలీసులు. ప్రత్యూష గదిలో కార్బన్‌మోనాక్సైడ్‌ బాటిల్‌ దొరకడంతో ఆ వాయువు పీల్చి మృతి చెందినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అనుమానాస్పదంగా మృతి చెందినట్టు కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకి తరలించారు.

ఇక ఆమె గది అంతా వెతకడంతో ప్రత్యూష రాసిన సూసైడ్ నోట్ బయట పడింది. ఇందులో మా తల్లితండ్రులకి భారం కాలేను, నేను కోరుకున్న జీవితం ఇది కాదు అని రాసుంది. దీంతో పోలీసులు పోస్టుమార్టం రిపోర్ట్ బయటకి వచ్చాక దర్యాప్తు మొదలు పెట్టనున్నారు.

gamdomCasibomJojobet Girişjojobet güncel girişjojobet giriş