జల ప్రాజెక్టులపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజలను ఎంత మోసం చేసిందో చెప్పడానికి… సోమవారం సుప్రీంకోర్టు పురుషోత్తమపట్నం విషయములు ఇచ్చిన తీర్పే నిదర్శనం. పురుషోత్తమపట్నం ప్రాజెక్టుకు ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండానే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం… టెండర్లను పిలిచి నానా హడావుడి చేసి వేల కోట్ల రూపాయలకు గండి కొట్టి జేబులు నింపుకోవాలని చూసింది.. ఎలాంటి ప్రత్యేకమైన ప్రయోజనం లేని పురుషోత్తమపట్నం ప్రాజెక్టును బూచిగా చూపి… తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రాజెక్టుల పేరుతో కోట్లు దండుకోవడానికి చూసారు అన్నది సుప్రీం తీర్పు ద్వారా అర్థం అవుతుంది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం అంటూ నానా హడావుడి చేసి… చివరకు ఎందుకు ఉపయోగం లేని పట్టిసీమ ను ప్రారంభించి… వందల కోట్లు దండుకుని, తమ బాకా పేపర్లతో, మీడియాతో నాన హడావుడి చేయించి…,తన గొప్పతనంగా అభివర్ణించిన చంద్రబాబు… అలాంటి మరో ప్రాజెక్టు పురుషోత్తం పట్నం లో కూడా భారీగా దండుకోవాలని చూశారు అన్నది వాస్తవం. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని గొప్పలు చెప్పుకున్న టిడిపి ప్రభుత్వం… దానికి అనుబంధంగా ప్రాజెక్టులు మొదలు పెట్టడం ప్రజలను మోసం చేయడమే. కేవలం తన పబ్బం గడుపుకోవాలనికి, ఈ ప్రాజెక్టులన్నీ తానే తీసుకు వచ్చాను అని చెప్పుకోవడానికి ఆ మాటున అమ్మవారికి టెండర్లు కట్టబెట్టి భారీగా ఆర్థిక ప్రయోజనాలు పొందారన్నది సత్యం.
పురుషోత్తమ పట్నం ప్రాజెక్టు మొత్తం టిడిపి హయాంలో రూపుదిద్దుకున్నది. గోదావరి నుంచి సుమారు రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని తోడి… పోలవరం ఎడమ కాలువ ద్వారా ఏలేరు ప్రాజెక్టులోకి మళ్ళించాలనేది ప్లాన్. 1638 కోట్లు వ్యయం అంచనా. అంటే పోలవరం ఎడమ కాలువ చేసే పని ఇది దాదాపు చేస్తుంది. కాలువలోని 48 కిలోమీటర్ దగ్గర నుంచి నీటిని ఎత్తి పోసి… ఏలేరు రిజర్వుయర్ లోకి నింపుతారు. అయితే పోలవరం ప్రాజెక్ట్ 2018 చివరి నాటికీ పూర్తి చేస్తామని చెప్పిన టిడిపి ప్రభుత్వం 2016 లో ఈ పురుషోత్తమపట్నం ప్రాజెక్ట్ ను ఎలా తెరమీదికి తెచ్చింది అన్నది అసలైన ప్రశ్న. అచ్చం పట్టిసీమ ఎత్తిపోతల పథకం అంటూ వేల కోట్లు మింగేసిన చందాన పురుషోత్తం పట్టణంలోనూ మొత్తం చుట్టేయాలని మొత్తం జేబులో వేసుకోవాలన్నదే ఈ ప్రాజెక్ట్ అసలు ఉద్దేశం. ఈ ప్రాజెక్టు విషయంలో పెద్దగా ప్రయోజనం కనిపించకున్నా… ఇది విశాఖ తూర్పుగోదావరి రెండు జిల్లాలను ఎంతో ప్రభావితం చేస్తోంది అని తమ సొంత పేపర్, మీడియాతో తాటికాయంత అక్షరాలతో ప్రతిరోజు ప్రచారం చేపించుకొని… ప్రజలకు ఏదో భారీగా లబ్ధి చేకూరుస్తూ నట్లు చంద్రబాబు అపర భగీరథడు అన్నట్లు చెప్పుకోవడం…. ద్వారా రాజకీయంగా ప్రయోజనం పొందాలని తెలుగుదేశం పార్టీ ప్లాన్. అయితే ఇది 2019 ఎన్నికల్లో ఏమాత్రం ప్రయోజనం ఇవ్వలేకపోయింది. తెలుగుదేశం పార్టీ ఆడుతున్న ఈ ప్రాజెక్టుల డ్రామాలు ప్రజలు గుర్తించారు. అందుకే పురుషోత్తమపట్నం ప్రాజెక్టు ద్వారా సస్యశ్యామలం అవుతాయని చెబుతున్న కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కడ టిడిపి గెలవలేకపోయింది. జగ్గంపేట, ప్రత్తిపాడు, అనకాపల్లి, పిఠాపురం వంటి నియోజకవర్గ ల్లో ఎక్కడ టీడీపీ జాడ లేకుండా పోయింది.
ఉమా కాస్త అతి!
2018 లోపు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం… పూర్తిచేసిన తర్వాతే 2019 ఎన్నికలకు వెళ్తాం అని తెలుగుదేశం ప్రభుత్వంsలో జలవనరుల శాఖ మంత్రిగా పని చేసిన దేవినేని ఉమామహేశ్వరరావు శాసనసభ సాక్షిగా చేసిన ప్రమాణమిది… పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టు. ప్రాజెక్టులో ఎడమకాలువ 181.5 కిలోమీటర్లు. కుడి కాలువ 174 కిలో మీటర్లు పొడవు ఉంటుంది. వైయస్ జలయజ్ఞం సమయంలోనే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కుడి ఎడమ కాలువలు దాదాపు పూర్తయ్యాయి. ఎడమ కాలువ తూర్పుగోదావరి విశాఖపట్నం వరకు వెళ్తూ తాగు సాగు నీటి అవసరాలు ఫ్యాక్టరీలకు మీరు మళ్లింపు వంటివి తీరుస్తుంది. 2019 లోపు ఎట్టి పరిస్థితిలో పోలవరం కట్టి… చూపుతామని శపథాలు చేసిన… ఇదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల కు ఎంతో ఉపయోగం అంటూ… గోదావరి నీటిని ఏలేరు రిజర్వాయర్లోకి ఎత్తి పోసి… తద్వారా తాగు, సాగు నీటి అవసరాలను విశాఖ, తూర్పుగోదావరి లకు తీరుస్తామని పురుషోత్తమపట్నం చెప్పడంలో ఆంతర్యం ఏంటి?? అసలు గోదావరి నీటిని గ్రావిటీ ద్వారా ఇచ్చుకునే అవకాశం ఉన్న చోట… వేల కోట్ల రూపాయలు తగలేసి ఈ ప్రాజెక్టు కట్టడం లో తెలుగుదేశం అత్యుత్సాహం, వారి మీడియా డబుల్ ఉత్సాహం తప్ప పురుషోత్తం పట్టణంలో పెద్దగా ప్రయోజనం ఏమీ కనిపించదు.
ఏలేరు కేపాసిటీ ఎంత??
ఏలేరు రిజర్వాయర్ కెపాసిటీ మొత్తంగా కలిపి 24 టిఎంసిలు. గోదావరిలో వరద వస్తే… పురుషోత్తమ పట్నం ద్వారా ఏలేరు రిజర్వాయర్ కు పంపాలి అనుకుంటున్నా మొత్తం 32 టీఎంసీలు. అంటే ప్రాజెక్టు పరిమితికి మించి గోదావరి నీటిని మళ్ళీస్తారా?? ఒక ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీరు నిండితే దాని డిస్పాచ్ అంత సులభమా?? ఎప్పటికప్పుడు 3500 క్యూసెక్కుల నీటిని ఏలేరు పంపించేందుకు సామర్థ్యం ఉందా?? ఇలా అనేక ప్రశ్నలు పురుషోత్తమపట్నం రిజర్వాయర్ నిర్మాణం అని చెప్పిన తర్వాత ఇంజనీర్లు చెప్పిన మాటలను గమనిస్తే కనిపిస్తాయి. తూర్పుగోదావరి విశాఖ ప్రాంతాలకు సాగునీటి ఇబ్బంది అసలు లేదు. ప్రతి చిన్న కాలువ ఆయకట్టులోని చివరి ఎకరానికి సైతం తడులు బాగా ఉందుతాయి. మరి అలాంటప్పుడు 1600 కోట్లు పెట్టి పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం కట్టాల్సిన అవసరం ఏముంది? పట్టిసీమ పూర్తికాగానే దీనికి హడావుడిగా… డిపిఆర్ గీయడం వెనుక కేవలం అమ్మవారికి కాంట్రాక్టర్లు ఇప్పించుకుని కమిషన్లు దండుకోవడానికి ప్రధాన ఎజెండాగా కనిపిస్తోంది. అప్పటికి అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఉత్తుత్తి ప్రాజెక్టుల పేరుతో మొత్తం తినేయాలని… పన్నిన పన్నాగం అర్థం అవుతుంది.
జగన్ కు సంబంధం ఏమిటీ??
జర్నలిజంలో నైతికతను ఏనాడో వదిలేసిన ఆంధ్రజ్యోతి రాతలు పట్టించుకోవలసిన అవసరం లేకపోయినప్పటికీ… సోమవారం సుప్రీంకోర్టులో పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకానికి ఎలాంటి పర్యావరణ అనుమతులు లేవని, ఈ ప్రాజెక్టు నిర్మాణం సరికాదంటూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పిన వెంటనే…. ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో మరో ఎదురుదెబ్బ అంటూ ఆంధ్రజ్యోతిలో బ్రేకింగ్ ఇచ్చుకోవడం వారికే చెల్లింది. తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు దగ్గరుండి మరీ తీసుకొచ్చిన పురుషోత్తపట్నం ప్రాజెక్ట్ కు ప్రస్తుత జగన్ ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే పురుషోత్తపట్నం నాటకం ఆడారు. దానిని ఆ నిజాన్ని దాచి ఇప్పుడేదో ప్రభుత్వానికి నష్టం వచ్చినట్లు జగన్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఏదో, అన్నట్లు ఆంధ్రజ్యోతి కలరింగ్ ఇచ్చి చంద్రబాబు తప్పును కప్పి పుచ్చి అని చూడడం విశేషం.
పర్యావరణ అనుమతులు లేకుండానే టెండర్లకు!
కనీసం ప్రాజెక్టు కట్టినప్పుడు పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే… ప్రాజెక్టు నిర్మాణం పనులు రెండు దశలుగా విభజించి టెండర్లు పిలవడం చంద్రబాబుకే చెల్లింది. టెండర్లు పిలిచి పనులు అప్పగించిన తర్వాత పర్యావరణ అనుమతులు ఎలా వస్తాయి అన్న కనీస స్పృహ లేకుండా పురుషోత్తమపట్నం విషయంలో ఆనాటి టిడిపి ప్రభుత్వం కళ్లు మూసుకొని వ్యవహరించింది. కేవలం ప్రజాధనాన్ని ప్రాజెక్టుల పేరుతో తినేయాలని వేసిన పన్నాగం మీ తప్ప పురుషోత్తమపట్నం వల్ల ప్రజలకు మేలు జరిగేది సున్నా. పోలవరం ప్రాజెక్టు కు పూర్తిస్థాయి నిధులు కేంద్రం ఇచ్చేలా ఒప్పించలేకపోయారని చంద్రబాబు ఇలాంటి అడపాదడపా చిన్న చిన్న ప్రాజెక్టుల పేరు చెప్పి ఖజానా కొల్లగొట్టేందుకు వేసిన ప్రణాళికలో ఇవన్నీ అని ఇప్పుడు అర్థం అవుతోంది.