iDreamPost
android-app
ios-app

భార్య ఫ్రెండ్‌కే లైన్ వేసిన అనిల్ రావిపూడి.. ఇంట్లో రోజూ గొడవే..

  • Published May 26, 2022 | 6:40 PM Updated Updated May 26, 2022 | 6:40 PM
  • Published May 26, 2022 | 6:40 PMUpdated May 26, 2022 | 6:40 PM
భార్య ఫ్రెండ్‌కే లైన్ వేసిన అనిల్ రావిపూడి.. ఇంట్లో రోజూ గొడవే..

అనిల్ రావిపూడి మొదటి నుంచి కూడా తీసిన అన్ని సినిమాలు హిట్ అవ్వడంతో సక్సెస్ డైరెక్టర్ గా దూసుకెళ్తున్నారు. తన కామెడీ రైటింగ్ ని నమ్ముకొని కామెడీ సినిమాలతో వరుస హిట్స్ కొడుతున్నారు. మే 27న అనిల్ రావిపూడి తెరకెక్కించిన F3 సినిమా రిలీజ్ అవ్వనుంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ లో అనిల్ బిజీబిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో పలు ఇంటర్వ్యూలు ఇచ్చిన అనిల్ రావిపూడి కొన్ని ఆసక్తికర విషయాలని పంచుకున్నాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్ కి సంబంధించిన సీక్రెట్ బయటపెట్టాడు.

అనిల్ రావిపూడి భార్య కూడా తను చదివిన కాలేజిలోనే చదివిందని, వాళ్ళది లవ్ మ్యారేజ్ అని గతంలో చాలా సార్లు చెప్పాడు. అనిల్ రావిపూడి తాజాగా ఈ సారి కొన్ని కాలేజీ విషయాల గురించి చెప్తూ.. కాలేజీలో నేను బ్యాచ్ మెయిన్‌టైన్ చేసేవాడిని. ఆ బ్యాచ్ అంతా కలిసి మరో నలుగురు అమ్మాయిల బ్యాచ్‌ను తెగ ఫాలో అయ్యేవాళ్ళం. ఆ నలుగురిలో ఓ అమ్మాయి అంటే అప్పట్లో నాకు ఇష్టం ఉండేది. ఆ అమ్మాయికి ఎప్పుడూ సైట్ కొడుతూ ఉండేవాడిని. కానీ చివరకు అదే బ్యాచ్ లోని ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని తెలిపారు.

అంటే పెళ్లి కాకముందు తన భార్య ఫ్రెండ్ కి రోజూ లైన్ వేసేవాడని తెలిపాడు. అయితే ఈ విషయం తన భార్యకి కూడా తెలియడంతో పెళ్లి అయ్యాక ఇప్పటికి కూడా రోజూ ఏదో ఒక సమయంలో తన ఫ్రెండ్ కి లైన్ వేశావంటూ సరదాగా గొడవ పడుతుంది అని తెలిపాడు అనిల్ రావిపూడి. ఆయన సినిమాల్లో లాగే ఫుల్ ఫన్, ఫ్రస్టేషన్ ఆయన లైఫ్ లో కూడా ఉందని తెలుస్తుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet