Idream media
Idream media
పోలవరం ప్రాజెక్టు పనులను హెచ్‌కే హల్దార్ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ శనివారం నుంచి మూడు రోజులపాటు పరిశీలించనుంది. ఢిల్లీ నుంచి శుక్రవారం రాత్రి విశాఖపట్నం చేరుకోనున్న కమిటీ శనివారం ఎడమ కాలువ పనులను పరిశీలించి, రాజమహేంద్రవరానికి చేరుకుంటుంది.
ఆదివారం పోలవరం హెడ్‌వర్క్స్‌ను(జలాశయం పనులు) పరిశీలించనుంది. సోమవారం(ఈ నెల 30న) కుడి కాలువ పనులను పరిశీలించి.. మధ్యాహ్నం విజయవాడలో రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనుంది. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలు, సమీక్షా సమావేశంలో వెల్లడైన విషయాల ఆధారంగా.. పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు జనవరి 2న నివేదిక ఇవ్వనుంది.