టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనుచరుల వద్ద భారీగా మద్యం పట్టివేత

నంద్యాల మాజీ శాశన సభ్యులు భూమా బ్రహ్మానంద రెడ్డి ముఖ్య అనుచరుడు, తెలుగుదేశం మాజీ కౌన్సిలర్ ముడియం కొండారెడ్డి కుమారుడు తార్నాక్ తెలంగాణ నుంచి భారీగా మద్యం తరలిస్తూ ఎక్సైజ్ పొలీసులకు పట్టుబడ్డాడు.AP 21 AF 3336 స్విఫ్ట్ డిజైర్ కారులో జోగులాంబ-గద్వాల్ జిల్లా ఆలంపూర్ వద్ద ఉన్న మద్యం దుకాణం నుంచి 11 కేసుల్లో మద్యం కొనుగోళ్ళు చేసి తార్నాక్ అక్రమంగా నంద్యాలకు తరలిస్తున్నాడు. కర్నూలు శివారులోని జాతీయ రహదారి టోల్ ప్లాజా వద్ద ఎక్సైజ్ పోలీసులు పట్టుకుని స్టేషన్ కు తరలించి కారును సీజ్ చేశారు. నంద్యాలకు చెందిన నారెళ్ల రాజేష్, తలారి శ్రీనివాసులు, తెలుగుదేశం మాజీ కౌన్సిలర్ ముడియం కొండారెడ్డిని ముద్దాయులుగా చేర్చారు.

కొండారెడ్డికి నంద్యాలలో చంద్రికా, గాయత్రి బార్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం తెచ్చిన నూతన మధ్యం పాలసీ అమలులోకి వచ్చిన తరువాత రేట్లు భారీగా పెరగటంతో తెలంగాణ నుంచి మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ విక్రయాలు జరుపుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. మద్య నిషేదాన్ని జగన్ సర్కార్ సీరియస్ గా తీసుకోవటంతో రాష్ట్రంలోకి అక్రమంగా తరలించే మద్యంపై ఉక్కుపాదం మోపాలని ఎక్సైజ్ అధికారులకు ప్రభుత్వం నుండి స్పష్టమైన ఆదేశాలు అందటంతో, అక్రమ మద్యం రవాణను పొలీసులు సీరియస్ గా తీసుకుని విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు.

Show comments