iDreamPost
android-app
ios-app

బాబు సన్నిహితుడుకు షాక్‌.. ఈడీ నుంచి సస్పెండ్‌ అయిన బొల్లినేని గాంధీ

బాబు సన్నిహితుడుకు షాక్‌.. ఈడీ నుంచి సస్పెండ్‌ అయిన బొల్లినేని  గాంధీ

ఆయన పేరుకే గాంధీ. కానీ చేసేవన్నీ చట్టవ్యతిరేకమైన పనులే. అవినీతి, అశ్రినిత పక్షపాతం, రాజకీయ నేతలకు వంతపాడడం.. ఇదీ ఈడీ మాజీ అధికారి, చంద్రబాబు, సుజనా చౌదరికి అత్యంత సన్నిహితుడుగా పేరొందిన బొల్లినేని శ్రీనివాస గాంధీ చౌదరి వ్యవహారం. 2017లో ఈడీ నుంచి జీఎస్టీ వసూళ్ల విభాగానికి వెళ్లిన శ్రీనివాస గాంధీ చౌదరి  అక్కడ  మరో అధికారితో కలసి ఓ క్లయింటు నుంచి ఐదు కోట్ల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసులో సీబీఐ కేసు నమోదు చేసింది. విచారణ తర్వాత శ్రీనివాస గాంధీ చౌదరి చేతి వాటం నిజమని తేలడంతో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ (సీబీఐసీ) అతన్ని సస్పెండ్‌ చేస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

శ్రీనివాస గాంధీ ఈడీ అధికారిగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితం. వైఎస్‌ జగన్‌ కేసుల్లో శ్రీనివాస గాంధీ చౌదరి చేసిన ఓవర్‌ యాక్సన్‌పై అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్‌ జగన్‌ను ఇబ్బందులు పెట్టేలా బాబు డైరెక్షన్‌లో బొల్లినేని శ్రీనివాస గాంధీ పని చేశారు. అప్పట్లోనే ఇతనిపై అనేక ఫిర్యాదులు వెళ్లాయి. ఈ క్రమంలోనే బొల్లినేనిని 2017లో ఈడీ నుంచి తప్పించారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్‌ జీఎస్టీ వసూళ్ల విభాగంలో సూపరింటెండెంట్‌గా చేరారు. అక్కడ కూడా చేతివాటం చూపడంతో తాజాగా సస్పెండ్‌కు గురయ్యారు.

శ్రీనివాస గాంధీ 1992 ఏప్రిల్ 27 న సెంట్రల్ ఎక్సైజ్ విభాగంలో చేరారు. అక్కడే ఆయనకు 2002 లో సూపరింటెండెంట్‌గా పదోన్నతి లభించింది. ఆ తర్వాత హైదరాబాద్ కమిషనరేట్ -1 లో ఆయనకు పోస్టింగ్ దక్కింది. తరువాత అతను 2003 లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) కు మరియు అక్కడ నుండి 2004 లో ED కి వెళ్ళాడు. అక్కడి నుంచే ఆయన చెలరేగిపోయినట్టు తాజా కేసు చెబుతోంది. ముఖ్యంగా జగన్ కేసుల్లో ఓవరాక్షన్ చేసిన అధికారిగా ఆయన మీద ఆరోపణలున్నాయి. చివరకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి.

ప్రస్తుతం హైదరాబాద్‌లోని జీఎస్టీ వసూళ్ల విభాగంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా అతని ఆస్తులపై సీబీఐ దాడులు చేసింది. దాంతో అసలు గుట్టురట్టయ్యింది. విజయవాడ, హైదరాబాద్‌లలో చేశారు. శ్రీనివాస్ చౌదరితో పాటుగా అతని కుటుంబ సభ్యుల పేరిట 3.74 కోట్ల రూపాయల విలువైన అక్రమ ఆస్తులను కనుగొన్నారు.

శ్రీనివాస గాంధీపై మూడేళ్ల క్రితమే జగన్ ఫిర్యాదు చేశారు. టీడీపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈడీలో శ్రీనివాస గాంధీ తనను వేధించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ చంద్రబాబు అండతో ఈడీలో అపరిమిత అధికారాలను సాగించినట్టుగా చెబుతున్నారు. 2004లో ఈడీలో చేరిన శ్రీనివాస గాంధీ 2017 వరకూ అక్కడే ఉన్నారు. చివరకు జగన్ ఫిర్యాదు తర్వాత ఆయన్ని ఈడీ నుంచి తొలగించారు.

ప్రధానంగా 2010 తర్వాత శ్రీనివాస గాంధీ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు సీబీఐ సోదాల్లో తేలింది. ఆయన తన కుటుంబ సభ్యుల పేర్లతో స్థిర, చర ఆస్తులను సంపాదించారని సీబీఐ ఎఫ్ ఐ ఆర్ లో పేర్కొంది. అతని ఆస్తులు పెరిగిన తీరుని కూడా సీబీఐ ప్రస్తావించింది. 2010కి ముందు ఆయన ఆస్తుల విలువ 21 లక్షలు కాగా అవి గత ఏడాది మధ్య నాటికి రూ. 2.76 కోట్ల కంటే ఎక్కువకి చేరినట్టు నిర్ధారించారు. అదే సమయంలో హైదారబాద్ లో భవన నిర్మాణం, కుమార్తెల చదువుల పేరుతో మరో రూ. 2.5 కోట్లను ఆయన ఖర్చు చేసినట్టు ఆధారాలు సేకరించారు.

కేవలం ఆయన ఆదాయం రూ. 1.30 కోట్లున్న సమయంలో ఆయన తన కుమార్తె చదువుల పేరుతో రూ. 70లక్షలు చెల్లించినట్టు సీబీఐ ఎఫ్ ఐ ఆర్ లో పేర్కొంది. చెన్నైలోని రామచంద్ర విశ్వవిద్యాలయంలో తన కుమార్తె వైద్య సీటు కోసం అతను పెద్ద మొత్తంలో ఖర్చు చేసినట్టు గుర్తించారు. శ్రీనివాస గాంధీ కేసులకు సంబంధించి 2017 జూన్ నాటికి ఆయన రూ. 3.74 కోట్లు అక్రమంగా సంపాదించినట్టు సీబీఐ వెల్లడించింది. అవినీతి నిరోధక చట్టంలోని 13 (10) (బి) తో చదివిన 13 (2) సెక్షన్ల కింద శ్రీనివాస గాంధీపై ఐబిసి ​​సెక్షన్ 109 కింద సిబిఐ అధికారులు కేసులు నమోదు చేశారు. విచారణలో శ్రీనివాస గాంధీపై నమోదైన అభియోగాలు రుజువు కావడంతో సీబీఐసీ అతనిపై వేటు వేసింది.