iDreamPost
android-app
ios-app

భారత న్యాయవ్యస్థపై ఆ ఇంగ్లాడ్ నిపుణుడు ఇచ్చిన నివేదికలో చెప్పింది చంద్రబాబు గురించేనా..?

  • Published Oct 20, 2020 | 1:04 PM Updated Updated Oct 20, 2020 | 1:04 PM
భారత న్యాయవ్యస్థపై ఆ ఇంగ్లాడ్ నిపుణుడు ఇచ్చిన నివేదికలో చెప్పింది చంద్రబాబు గురించేనా..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో హైకోర్టు వ్యవహరిస్తున్న తీరుపైన దానికి కారణమైన పెద్దలపైన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే కు లేఖ ద్వార ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తున్న నేపథ్యంలో ప్రశాంత్ భూషన్ లాంటి ప్రముఖ న్యాయవాదులు సైతం ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ తమ వాదనను వినిపిస్తూ వచ్చారు.

అయితే ఈ వ్యవహారంపై తాజాగా స్పందించిన జస్టిస్‌ శ్రీనివాస రంగనాథ వర్మ గతంలో జరిగిన కొన్ని కీలక పరిణామాలపై వాఖ్యలు చేస్తూ భారత న్యాయవ్యవస్థపై ఇంగ్లాండ్ యూనివర్శిటీకి చెందిన ఓ వ్యక్తి రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తికి న్యాయస్థానాల్లో ఉన్న పలుకుబడిపై వివరిస్తూ తమ నివేదికలో పేర్కొన్నారని , ఈ వ్యవహారం ఇప్పటిది కాదని మన న్యాయవ్యవస్థలో ఉన్న లోపాలపై ఆనాడే ఇంగ్లాండ్ కు చెందిన వ్యక్తి చెప్పటం అంటే ఎలాంటి పరిణామాలు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చని చెప్పుకొచ్చారు.

జస్టిస్ శ్రీనివాస్ రంగనాధ వర్మ చేసిన వాఖ్యల ప్రకారం చూస్తే ఆ ఇంగ్లాండ్ కు చెందిన నిపుణుడు చెప్పిన ఆ వ్యక్తి మరెవరో కాదని మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్షనేత గా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడే అని అర్ధం అవుతుంది. ఈ ఇంగ్లాండ్ నిపుణుడి వ్యవహారం నేడు చాలా మందికి తెలియకపోయిన 2003లో రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఇది ఒక తీవ్ర చర్చనీయాంశం అయిందని చెబుతున్నారు. ఆ ఇంగ్లాండ్ వ్యక్తి నివేదికలో ప్రస్థావించిన అంశాలు ఒకసారి పరిశీలిస్తే ఈ విధంగా ఉన్నాయి

2003లో చంద్రబాబు పాలనలో ఉన్నప్పుడు మన హైకోర్ట పై , మన న్యాయవ్యవస్థపై ఇంగ్లాండుకి చెందిన జేంస్ మ్యానర్ అనే నిపుణుడు కొన్ని వ్యాఖ్యలు చేసారు దాని సారాంశం.

భారత న్యాయ వ్యవస్థ నిజంగా స్వతంత్రమైనది కాని తెలివైన ముఖ్యమంత్రులు కొన్నిసార్లు న్యాయమూర్తులపై తమ ప్రభవాన్ని ప్రసరింప చేయగలుగుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విషయంలో ఇదే చాతుర్యం ప్రదర్శిస్తున్నారని రిటైర్డ్ న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు బలంగా విశ్వసిస్తున్నారు.

ఇందుకోసం ఆయన తనకు విశ్వాసపాత్రుడైన ఒక అడ్వకేట్ జనరల్ ను వినియోగిస్తున్నారు. ఆ అడ్వకేట్ జనరల్ హైకోర్టుతొ సంస్థాపరమైన , వ్యక్తిగతమైన సంబంధాలు నెలకొల్పడంలో కీలక పాత్ర వహిస్తున్నారు, వీటి ద్వార అతను న్యాయమూర్తుల నుండి గౌరవ ప్రపత్తులు కూడా పొందుతున్నారు. ఎంతో నైపుణ్యం ప్రదర్శించి వారితో భాందవ్యం నెలకొల్పుకున్నారు.

ఈ మాటలు అనటం ద్వారా చంద్రబాబు రాష్ట్ర హైకోర్టు మొత్తాన్ని నియంత్రిస్తున్నారు అని చెప్పటం నా ఉద్దేశం కాదు. అయితే హైకోర్టుపై ముఖ్యమంత్రికి చెప్పుకోదగ్గ పలుకుబడి ఉన్నది అనేది మాత్రం నిజం. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో తనకు ఉన్న సత్సంబంధాలు ఉపయోగపెట్టి తన సొంత న్యాయవాదులు ఇద్దరిని హైకోర్టు న్యాయమూర్తులు గా నియమింపచేయగలిగారు. దానితో వీరు ఇద్దరు పక్షపాత పూర్వకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నియామకాల వల్ల హైకోర్టుపై చంద్రబాబు పలుకుబడి మరింతగా పెరిగిపోయింది. రాజకీయంగా ఈ పరిణామాలు ఎంతో ప్రశంసనీయమైనవి కానీ న్యాయవ్యవస్థ సంస్కరణల దృష్టిలో చూస్తే మాత్రం సహేతుకం కావు.

చంద్రబాబు కోర్టు పరంగా చేస్తున్న ఈ పనులు పేద ప్రజలకు న్యాయ సౌకర్యం కల్పించటానికి కాని , స్వతంత్ర న్యాయ సాధనకు కాని, కోర్టులో పేరుకుపొతున్న పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించటానికి కాని, జిల్లా స్థాయి న్యాయస్థానాలలో పెరిగిపోతున్న అవినీతిని అరికట్టటంలో కాని ఎంతమాత్రం ఉపకరించేవి కావు. నేర పరిశోధక సంస్థపై అధికారంలో ఉండే పార్టీకి పూర్తి పెత్తనం లభిస్తుంది. తమకు కావాల్సిన వారిపై నేరారోపణలు ఉపసంహరించుకోగలుగుతున్నారు. తమకు గిట్టనివారిపై ఉద్దేశ పూర్వకంగా లేనిపోని విచారణ జరిపిస్తున్నారు. మిగిలిన రాష్ట్రాల వలే ఇక్కడకూడా ఈ సంస్థ పెత్తనాన్ని స్వార్ధం కోసం దుర్వినియోగం చేస్తున్నారు.

భారతీయ న్యాయ కమీషన్ 114వ నివేదికలో పేర్కొన్నట్లు స్థానిక కోర్టులకు ఒక మోడల్ పద్దతి అనుసరించటం ద్వారా పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించవచ్చు. ఎన్.టి రామారావు అధికారంలో ఉన్నప్పుడు ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఈ తరహాలో ఒక చట్టం చేసి రాష్ట్రపతి ఆమోదం కోసం కూడా పంపింది. అయితే చంద్రబాబు పదవి చేపట్టగానే ఆ చట్టాన్ని నిశబ్దంగా ఉపసహరించివేశారని ఇంగ్లాడ్ నిపుణుడు జేంస్ మేనర్ తన నివేదికలో పేర్కొన్నారు. దీనిని ఆనాడు ఒక దినపత్రిక ప్రముఖంగా ప్రచురించింది..