iDreamPost
android-app
ios-app

మాసే లక్ష్యంగా ఎనర్జిటిక్ స్టార్

  • Published Aug 31, 2021 | 7:01 AM Updated Updated Aug 31, 2021 | 7:01 AM
  • Published Aug 31, 2021 | 7:01 AMUpdated Aug 31, 2021 | 7:01 AM
మాసే లక్ష్యంగా ఎనర్జిటిక్ స్టార్

ఇస్మార్ట్ శంకర్ తో దక్కిన మాస్ ఇమేజ్ ని వదులుకునేందుకు ఎనర్జిటిక్ స్టార్ రామ్ సిద్ధంగా లేడు. రెడ్ మిశ్రమ ఫలితాన్నే ఇచ్చినప్పటికీ కమర్షియల్ గా సేఫ్ కావడంతో ఇకపై కూడా ఇదే తరహా కథలతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం తను లింగుస్వామి దర్శకత్వంలో ఓ ప్రాజెక్టు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ఉస్తాద్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది కానీ అధికారికంగా అనౌన్స్ చేయలేదు. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో రామ్ పోలీస్ ఆఫీసర్ గా డాక్టర్ గా రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నట్టుగా టాక్ ఉంది కానీ క్లారిటీ లేదు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కి సంగీతం దేవిశ్రీప్రసాద్

ఇదిలా ఉండగా దీని తర్వాత రామ్ బోయపాటి శీనుతో చేయడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని ఫిలిం నగర్ టాక్. బాలకృష్ణ అఖండ నిర్మిస్తున్న మిర్యాల రవీంద్ర రెడ్డే నిర్మాతగా దీన్ని భారీ బడ్జెట్ తో రూపొందించేందుకు ఆల్రెడీ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయట. అఖండ ఫలితం మీద ఉన్న ఫుల్ కాన్ఫిడెన్స్ తోనే ఇప్పుడీ సినిమా కార్యరూపం దాలుస్తోందని సమాచారం. వెంకటేష్ లాంటి ఫ్యామిలీ హీరోనే అరివీర ఫ్యాక్షనిస్టుగా తులసిలో చూపించిన బోయపాటి ఇక రామ్ ని ఏ రేంజ్ లో ప్రొజెక్ట్ చేస్తాడో వేరే చెప్పాలా. వినయ విధేయ రామలో ఇది బాగా ఓవర్ అయిపోయి ఫ్లాప్ అందుకున్నారు కానీ కొలతలు సరిగ్గా పడి ఉంటే దాని రేంజ్ ఎక్కడికో వెళ్ళేది

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావడానికి ఇంకా టైం పడుతుంది. రెడ్ తో పాటు లాక్ డౌన్ వల్ల ఇస్మార్ట్ శంకర్ తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న రామ్ ఇకపై స్పీడ్ పెంచబోతున్నాడు. పెద్దగా ఫామ్ లో లేని లింగుస్వామితో సినిమా చేయడం పట్ల అభిమానులు కొంత అనుమానంగా ఉన్నా పందెం కోడి రేంజ్ లో ట్రీట్మెంట్ పడితే బ్లాక్ బస్టర్ ఖాయమనే నమ్మకమూ వాళ్ళలో ఉంది. పైగా ఇది గతంలో అల్లు అర్జున్ దాకా వెళ్లిన సబ్జెక్టనే ప్రచారం కూడా బయట జరుగుతోంది. సో అన్నీ కరెక్ట్ గా కుదిరితే మరో మాస్ హిట్టు పడ్డట్టే. చూస్తుంటే సాఫ్ట్ లవర్ బాయ్ పాత్రలు రామ్ గుడ్ బై చెప్పినట్టే కనిపిస్తోంది. మాస్ కన్నా సేఫ్ ఇంకేముంటుంది

Also Read : అమ్మాయిలకు అండగా సీటిమార్ కోచ్

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetjojobet girişdeneme bonusu veren sitelerMariobetmadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet