iDreamPost
android-app
ios-app

రెండు రోజుల్లో ‘ఏలూరు’ మిస్టరీకి తెర..?

  • Published Dec 09, 2020 | 12:19 PM Updated Updated Dec 09, 2020 | 12:19 PM
రెండు రోజుల్లో ‘ఏలూరు’ మిస్టరీకి తెర..?

రానున్న రెండు రోజుల్లో అంటే శుక్రవారం నాటికల్లా ఏలూరులో అంతుచిక్కని అస్వస్థతకు తెరపడనుందని వైద్యనిపుణులు భావిస్తున్నారు. రోగుల నుంచి సేకరించిన ద్రవాల శాంపిల్స్‌తో పాటు, స్థానికంగా బాధితులు వినియోగించిన త్రాగునీరు, పాలు, ఇతర ఆహార పదార్ధాల శాంపిల్స్‌ను కూడా పరీక్షల నిమిత్తం సేకరించారు. ఆయా శాంపిల్స్‌ను స్థానిక వైద్య పరిశోధక బృందాలతో పాటు ఎయిడ్స్, సీసీయంబీ, ఎన్‌సీడీసీ తదితర సంస్థలకు పంపించడారు. ప్రాథమికంగా పరీక్షల్లో ఎటువంటి ఇబ్బందులు బైటపడలేదు.

అయితే సెల్‌ కల్చరల్‌ స్థాయిలో ఉన్నత స్థాయి పరిశోధకులు చేయనున్న పరీక్షల ద్వారా పూర్తిస్తాయిలో సమస్యకు కారణం ఏంటన్నది బైటపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో లెడ్, సీసం వంటి భార లోహాలు రోగుల శరీరాల్లో ఉన్నట్లు తేలింది. ఇవి ఏ విధంగా వారిలోకొ వచ్చాయన్నదానితో పాటు, బాధితుల శరీరాలపై ఏ విధమైన మార్పులను ఇవి కల్గిస్తాయన్నది కూడా శుక్రవారం నాటికి బహిర్గతమయ్యేందుకు అవకాశం ఉందుంటున్నారు.

మరో వైపు సీయం వైఎస్‌ జగన్‌ ఏలూరులోని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. వైద్యశాఖా మంత్రి ఆళ్ళ నాని ఏలూరులోనే మకాం వేసి బాధితులకు అందుతున్న వైద్య చికిత్సలను గురించి నిరంతరం పరిశీలిస్తున్నారు. బాధితులకు చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాష్ట్ర ప్రభుత్వం చేర్చింది.