iDreamPost
android-app
ios-app

చంద్రబాబు నిర్లక్ష్య పలితం

చంద్రబాబు నిర్లక్ష్య పలితం

చంద్రబాబు నిర్లక్ష్య పలితం భారీ మూల్యం చెల్లించుకున్న ప్రజలు..

ఒక పారిశ్రామిక వేత్త ప్రయోజనాల కోసం ఏకంగా ఒక రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారా ? అంటే అవుననే అనాల్సి వస్తుంది.

వివరాల్లోకి వెళితే……

బీజేపీ మిత్రపక్షంగా కొనసాగినన్నిరోజులు కేంద్రం మనకు అన్నీ ఇచ్చింది అంటూ కాలం గడిపి ఎన్నికల ముందు ధర్మ పోరాట దీక్షలు అంటూ హడావుడి చేశాడు కానీ విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావలసిన ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టలేదు.

రాష్ట్ర విభజన చట్టం 2014 ప్రకారం నెల్లూరు జిల్లాలో దుగరాజపట్నం ఓడరేవును కేంద్రం పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సారధ్యంలో నిర్మించాలి. దీనికి సంబంధించి విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం కేంద్ర ప్రభుత్వం 2018 మార్చి నాటికి మొదటి దశ పూర్తి చేయాలి. అయినా కానీ చంద్రబాబు దుగరాజ పట్నం రేవు పట్టించుకోకపోవటం,కేంద్రం మొదట షార్ అభ్యంతరం చెప్పిందని,అక్కడికన్నా మంచి లొకేషన్ కోసం చూస్తున్నామని కాలయాపన చేసి ఇప్పుడు దుగ్గరాజపట్నం అనువైన ప్రదేశంకాదని, ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేశామని ఓడరేవుల శాఖ మంత్రి చెప్పారు. ‘‘కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ నియమించింది. ఈ ఓడరేవు ప్రతిపాదనను కమిటీ పరిశీలించిన అనంతరం దుగరాజపట్నంలో ఓడరేవు అభివృద్ధికి పరిస్థితులు సానుకూలంగా లేవని నివేదించింది. ఈ కారణంతోనే ఓడరేవుకోసం నిధులు సమకూర్చలేదు’’ అని నిన్న రాజ్య సభలో కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి మండావీయ స్పష్టం చేశారు .

Also Read:క‌మ‌లం కుదేలు – చాణ‌క్యుడికి చావు దెబ్బ 

అయితే కేంద్ర నిర్ణయం వెనుక వేరే కారణాలున్నటు కనిపిస్తుంది. దుగరాజపట్నం ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లోనే కృష్ణపట్నం ఓడ రేవును అదాని కంపెని తీసుకోవటానికి చర్చలు జరుగుతున్నాయి. దుగరాజపట్నం కు అత్యంత సమీపంలో తమిళనాడులో కటువుపల్లిలోని ఓడ రేవు ను కూడా అదాని తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే దుగరాజపట్నం కు రెండు వైపులా అదానికి చెందిన రెండు ఓడ రేవులు ప్రయివేటు రంగంలో రానున్నాయి. ప్రభుత్వ రంగంలో ఓడ రేవు సమీపంలో ఉంటే ప్రవేటు రంగంలో ఉన్న ఓడరేవు కు పెద్దగా లాభం ఉండదు కనుక విభజన చట్టంలో పేర్కొన్న దుగరాజపట్నం ను అదాని ప్రయోజనాల కోసం పక్కనపెట్టారన్న అనుమానం కలుగుతోంది.

కీలకమైన సమయంలో దుగరాజపట్నం ఓడ రేవును చంద్రబాబు నిర్లక్ష్యం చేయడంవల్ల రాష్ట్రానికి, ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు తీరని అన్యాయం జరిగింది. వాస్తవానికి విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయడానికి కేంద్రం ఏనాడు నిజాయితీగా కృషి చేయలేదు ఫలితంగా ఎక్కువ నష్టం జరిగింది.

కడప ఉక్కు… తొలి నాలుగు సంవత్సరాలు బీజేపీతో స్నేహం చేసి కడప ఉక్కు సాధన కోసం కాకుండా, అది ఎలా సాధ్యం కాదో మాట్లాడింది చంద్రబాబే. ఎన్నికల సమయంలో. పోరాటం చేసి రాజకీయాల కోసం రాష్ట్ర ప్రభుత్వమే శంకుస్థాపన చేసి కేంద్రం ఉక్కు పరిశ్రమన్న చర్చ లేకుండా చేశారు .

Also Read : అనంతపురం-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే

మన్నవరం.….

2007 లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ శంకుస్థాపన చేసిన మన్నవరం విద్యుత్ ప్రాజెక్ట్ మొదటి దశ పూర్తి చేసుకొని ఉత్పత్తి ప్రారంభంఅయింది . రెండవ దశ పనులను పూర్తి చెయ్యకుండా కేంద్రం నిర్లక్ష్యం చేస్తుంటే చంద్రబాబు ఏనాడు అడిగిన పాపాన పోలేదు. చట్టంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైన ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని ఉన్నా కేంద్రం చేయలేదు రాష్ట్రం అడగలేదు.

మన్నవరం ప్రాజెక్టులో పెట్టుబడులను నాలుగోవంతుకు తగ్గిస్తూ 2016 లో కేంద్రం నిర్ణయం తీసుకున్నా చంద్రబాబు స్పందించలేదు. 2018లో ఈ ప్రాజెక్టు మూసివేతకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఆ ప్రాజెక్టును కాపాడటానికి ప్రయత్నం చెయ్యలేదు.

ఇలా విభజన చట్టంలోని అంశాల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా నాలుగు సంవత్సరాలు కేంద్రానికి వెన్నుదన్నుగా ఉండి ఎన్నికల ప్రచారంలో అర్థంలేని పోరాటం పేరుతో మొత్తం విభజన చట్టాన్ని రాజకీయ విషవలయం లోకి చంద్రబాబు నెట్టివేశారు. కడప ఉక్కు , మన్నవరం , దుగరాజపట్నం పూర్తి చేసి ఉంటే నేడు రాష్ట్రం,రాయలసీమ & నెల్లూరు జిల్లాలు పారిశ్రామికంగా అత్యంత అభివృద్ధి చెంది ఉండేది. గత ప్రభుత్వ తప్పిదం,కేంద్రం నిర్లక్ష్యం వెరసి రాష్ట్రానికి ముఖ్యంగా రాయలసీమ ,నెల్లూరు జిల్లాకు తీరని నష్టం వాటిల్లిందని చెప్పక తప్పదు.

Written By Purushotham Reddy Makireddy