iDreamPost
android-app
ios-app

పెట్రోల్ రేట్లు పెరిగాయి.. ఎయిర్‌పోర్టుకు గాడిదపై వస్తాను.. అంటూ ఓ ఉద్యోగి లేఖ..

  • Published Jun 03, 2022 | 8:00 PM Updated Updated Jun 03, 2022 | 8:00 PM
పెట్రోల్ రేట్లు పెరిగాయి.. ఎయిర్‌పోర్టుకు గాడిదపై వస్తాను.. అంటూ ఓ ఉద్యోగి లేఖ..

ప్రస్తుతం పాకిస్థాన్‌లో తీవ్ర సంక్షోభం నెకొంది. అన్ని వస్తువుల రేట్లు పెరిగిపోతున్నాయి. ఇక ఇంధన ధరలు అయితే మండిపోతున్నాయి. రోజు రోజుకి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్ లో లీటరు పెట్రోల్‌ ధర రూ.209 కాగా డీజిల్‌ ధర రూ.204 ఉంది.

ఇలా పెట్రోల్ రేట్లు పెరగడంతో పాకిస్థాన్ పౌర విమానయాన శాఖకు చెందిన ఓ అధికారి తన బాస్‌కు రాసిన ఓ లెటర్ వైరల్ గా మారింది. 25 ఏళ్లుగా విమానయానశాఖలో పనిచేస్తున్న ఆసిఫ్‌ ఇక్బాల్‌ అనే ఉద్యోగి ప్రస్తుతం ఇస్లామాబాద్‌ ఇంటర్నేషనల్‌ విమానాశ్రయంలో పని చేస్తున్నారు. పెట్రో ధరలు పరిగినందుకు ఆయన ఎయిర్ పోర్ట్ కి గాడిద మీద వస్తాను అనుమతివ్వండి అంటూ లేఖ రాయడం చర్చనీయాంశం.

పెట్రో ధరలు భారీగా పెరగడంతో సొంత ప్రయాణం భారమైందని, గాడిద బండిపై ఎయిర్‌పోర్టుకు వచ్చేందుకు తనకు అనుమతివ్వాలని, ఈ ద్రవ్యోల్బణంలో సంస్థ రవాణా సదుపాయాన్ని నిలిపివేసింది. పెట్రోల్‌ ధరలు పెరుగుతుండటంతో మా సొంత వాహనాల వాడకం కష్టం. దయచేసి నా గాడిద బండిని విమానాశ్రయంలోకి తీసుకొచ్చేందుకు, పార్కింగ్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వండి అంటూ అతను రాసిన లేఖలో పేర్కొన్నాడు.