iDreamPost
android-app
ios-app

దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిగా నర్సారెడ్డి ?

దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిగా నర్సారెడ్డి ?

టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ మరియు బీజేపీలు దుబ్బాకలో తమ గెలుపు గుర్రాలను బరిలో దింపే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ నుండి రఘునందన్ రావు అభ్యర్థిత్వం దాదాపు ఖరారు కాగా కాంగ్రెస్ అభ్యర్థిగా సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి పేరు ఖరారు అయినట్లు తెలుస్తుంది.

దుబ్బాక ఉప ఎన్నిక నవంబర్ 3 న జరగనుండగా నవంబర్ 10 న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. కాగా టీఆర్ఎస్ తరపున ఎవరు పోటీ చేయనున్నారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. టిఆర్ఎస్ తరపున రామలింగారెడ్డి భార్య లేదా కుమారుడు ఉప ఎన్నిక అభ్యర్థిగా ఉండొచ్చని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ముందుగా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టి అధికార పార్టీ స్థానంలో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. దుబ్బాక ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా నర్సారెడ్డి పేరును ఈరోజు అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది మరికొద్దిసేపట్లో తెలుస్తుంది.