iDreamPost
android-app
ios-app

గోపీచంద్ మొదటి పారితోషికం ఇంత తక్కువా??

  • Published Jun 14, 2022 | 8:45 AM Updated Updated Jun 14, 2022 | 8:45 AM
  • Published Jun 14, 2022 | 8:45 AMUpdated Jun 14, 2022 | 8:45 AM
గోపీచంద్ మొదటి పారితోషికం ఇంత తక్కువా??

విలన్ గా కెరీర్ మొదలు పెట్టిన గోపీచంద్ అందర్నీ భయపెట్టి, ఆ తర్వాత హీరోగా మారి వరుస హిట్లు సాధించాడు. తర్వాత కెరీర్ లో కాస్త తడబడ్డా మళ్ళీ ఇప్పుడు పుంజుకుంటున్నాడు. ఇటీవలే సీటిమార్ సినిమాతో హిట్ కొట్టిన గోపీచంద్ త్వరలో పక్కా కమర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. గోపీచంద్ హీరోగా, రాశిఖన్నా హీరోయిన్ గా మారుతి దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్, GA2 బ్యానర్స్ పై పక్కా కమర్షియల్ సినిమా తెరకెక్కింది. జులై 1న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది.

ఇటీవల రిలీజ్ చేసిన సాంగ్స్, ట్రైలర్స్ కి మంచి స్పందన లభించింది. పక్కా కమర్షియల్ సినిమా కామెడీ, మాస్, యాక్షన్ అంశాలతో ఉండనుంది. ప్రమోషన్స్ కూడా అప్పుడే మొదలుపెట్టేశారు. ఇటీవలే ట్రైలర్ లాంచ్ ఈవెంట్, ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా గోపీచంద్ ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో పలు ఆసక్తికర విషయాలని తెలియచేశాడు.

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గోపీచంద్ తన మొదటి పారితోషికం గురించి తెలిపారు. గోపీచంద్ మాట్లాడుతూ.. నేను విలన్ గా చేసిన జయం సినిమాకి మొదటిసారి నా చేతుల్తో పారితోషికం తీసుకున్నాను. జయం డైరెక్టర్ తేజ లక్కీ నంబర్ 11 అని నాకు పదకొండు వేల రూపాయల చెక్ ఇచ్చారు. ఆ చెక్ ని చూసి ఇంతేనా అనుకోని దాని పక్కన ఇంకో సున్నా పెడితే బాగుండు అనుకున్నాను. ఆ డబ్బులు తీసుకొని ఇంట్లో ఇచ్చేశాను. వాళ్ళు దేనికి ఖర్చు పెట్టుకున్నారో నాకు తెలీదు అని తెలిపాడు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş