Diabetes: మూత్రంలో మీకు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మీకు ఈ వ్యాధి సోకినట్లే!

మూత్రంలో మీకు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మీకు ఈ వ్యాధి సోకినట్లే!

కాలానికి అనుగుణంగా మారిన ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో వచ్చిన మార్పుల కారణంగా రకరకాల వ్యాధులు సోకుతున్నాయి. అయితే ఆ వ్యాధులు సోకిన విషయం మనకు తొందరగా తెలియకుండానే అది మరింత ముదిరి చివరికి ప్రాణాల మీదకు వస్తుంది. కొందరు మాత్రం.. ఈ వ్యాధిని ఎలా గుర్తించాలో తెలియక, లక్షణాలను పసిగట్టలేక జనాలు సతమతమవుతుంటారు. ఇదిలా ఉంటే.. మీకు తరుచుగా మూత్రంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? నీరు తాగకపోయిన తరుచు మూత్రం వస్తుందా? అయితే మీరు ఖచ్చితంగా ఆ వ్యాధి బారిన పడినట్లే అంటున్నారు వైద్య నిపుణులు. అసలు ఎలాంటి లక్షణాలు ఉంటే వ్యాధి సోకినట్లు? నిపుణులు ఏం చెబుతున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ముములుగా మూత్ర విసర్జన సమయంలో కొందరికి ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అవేంటంటే? నీరు ఎక్కువగా తాగకపోయిన తరుచు మూత్రం రావడం, రాత్రిపూట చాలా సార్లు మూత్రం రావడం, దీంతో పాటు దుర్వాసనతో పాటు మూత్రం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం.. ఖచ్చితంగా మీరు మధుమేహం వ్యాధి బారిన పడినట్లేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలను మీకు ఉంటే వెంటనే దగ్గరలోని వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. వ్యాధి ఉన్నది తెలిసినా కూడా నిర్లక్ష్యం చేస్తే మాత్రం.. మొదటికే మోసం వస్తుందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Show comments