Vinay Kola
Diabetes: దేశంలో షుగర్ పేషెంట్లు చాలా ఎక్కువ అవుతున్నారు. చాప కింద నీరులా షుగర్ వ్యాపిస్తూ ఉంది.
Diabetes: దేశంలో షుగర్ పేషెంట్లు చాలా ఎక్కువ అవుతున్నారు. చాప కింద నీరులా షుగర్ వ్యాపిస్తూ ఉంది.
Vinay Kola
డయాబెటీస్.. ప్రస్తుతం జనాలను వణుకు పుట్టిస్తున్న సమస్య. ఇది ఒక్కసారి వచ్చిందంటే చచ్చేదాక పోదు. దేశంలో ఎక్కువ మంది ఈ సమస్యతో సతమతం అవుతున్నారని తేలింది. ఏకంగా పది కోట్ల కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్య ఇది. ఆ కుటుంబాల్లో దాదాపు 40 కోట్లమందిని మానసికంగా వేధిస్తోంది ఈ షుగర్ వ్యాధి. దేశ జనాభాలో వీరి శాతం ఏకంగా 11.4 శాతంగా ఉంది. పేరుకు షుగరే.. దీని వల్ల ఎలాంటి నొప్పి ఉండదు.. కానీ మీ ఒళ్ళంతా కూడా విషం నింపేస్తుంది. నచ్చిన ఫుడ్ తినలేరు. ఎక్కువగా పని చేయలేరు. ఇది చాలా ప్రాణాంతకం.ఇదొక సైలెంట్ కిల్లర్. ఇది లాస్ట్ స్టేజీకి వచ్చిందంటే నరకం స్పెల్లింగ్ ఏంటో నేర్పించి మరీ చంపేస్తుంది. అంత ప్రమాదకరం ఈ షుగర్ వ్యాధి. డయాబెటీస్ రావడానికి ముందు ఒక స్టేజ్ ఉంటుంది. అదే ప్రీ డయాబెటీస్. దేశంలో ఈ స్టేజ్ లో ఉన్నవారు ఎందరో తెలిస్తే.. కచ్చితంగా షాక్ అవుతారు. ఏకంగా 13 కోట్ల 60 లక్షల మంది ఈ స్టేజ్ లో ఉన్నారు. అంటే దేశ జనాభాలో 15.3 శాతం అనమాట. మన దేశంలో అతి పెద్ద రాష్ట్రాలలో ఒకటైన మహారాష్ట్రలో ఉన్న జనాభా కంటే ఈ నెంబర్ ఎక్కువ. అంటే దేశంలో షుగర్ పేషెంట్లు, షుగర్ వచ్చే అవకాశం ఉన్న పేషెంట్లు దాదాపు 24 కోట్ల మంది ఉన్నారు. అంటే వీరి మొత్తాన్ని కలిపితే ఒక పెద్ద రాష్ట్రమే అవుతుంది. దీన్ని బట్టి ఇండియాలో డయాబెటీస్ డేంజర్ బెల్స్ ఎంతలా మోగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. కాబట్టి కచ్చితంగా చాలా జాగ్రత్తగా ఈండాలి. షుగర్ వ్యాధి అసలెందుకు వస్తుంది? నిజానికి చాలామందికి దీనిపై ఇప్పటికీ కూడా అవగాహన లేదు. డాక్టర్ల దగ్గరకి వెళ్ళే టైమ్ కూడా లేదు. మరి దీనికి పరిష్కారమే లేదా? అందుబాటులో చికిత్సలే లేవా? ఒక మార్గం ఉంది..
అదేంటంటే.. ఇది రాకుండా జాగ్రత్త పడటమే.. వచ్చాక కూడా జాగ్రత్త పడొచ్చు.. కానీ సహనం అనేది కచ్చితంగా ఉండాలి. 80 శాతం మంది రోగుల్లో 3 స్టేజీల తరువాతే ఈ వ్యాధి ఉన్నట్టు తేలింది. అంటే వాళ్లు డేంజర్ జోన్ లో ఉన్నట్లే. నిజానికి ఈ మూడు స్టేజ్ లలోపే దీనిని గుర్తించగలిగితే.. షుగర్ ని కచ్చితంగా కంట్రోల్ చేయవచ్చు. డయాబెటీస్ లో టైప్1, టైప్2 అని రెండు ఉన్నాయి. దేశంలో 90 శాతం మంది టైప్2తో బాధపడుతున్నవారే. దీని లక్షణాలను చూస్తే.. దాహం ఎక్కువగా వేస్తుంది. ఎక్కువ సార్లు యూరిన్ కు వెళ్లాల్సి ఉంటుంది. నీరసం బాగా పెరిగిపోతుంది. ఆకలి ఎక్కువ అవుతుంది. కంటి చూపు తగ్గుతుంది. గాయమైతే.. అది ఈజీగా మానదు. బరువు కూడా ఈజీగా తగ్గిపోతారు. ఈ లక్షణాలతో బాధపడుతున్నట్టయితే కచ్చితంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. HbA1c టెస్టు చేయించుకుంటే.. శరీరంలో డయాబెటిస్ ఉందో లేదో తెలుస్తుంది. షుగర్ లెవర్.. 5.7 శాతం లోపు ఉంటే.. ప్రాబ్లమ్ లేదు కానీ అదే 5.7 నుంచి 6.4 శాతం మధ్యలో ఉంటే మాత్రం డయాబెటీస్ కు ముందు స్టేజ్ లో ఉన్నారని అర్థం. ఇక 6.5 శాతం దాటితే.. వారికి డయాబెటీస్ ఉన్నట్టే. ఇక మరో రకమైన షుగర్ టెస్ట్ కూడా ఉంది. పరగడుపున షుగర్ లెవల్స్ 100 నుంచి 126 లోపు, అలాగే బ్రేక్ ఫాస్ట్ అయ్యాక 140 నుంచి 200 లోపు ఉంటే.. వారికి షుగర్ వచ్చే ఛాన్సుంది. అయితే ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నప్పుడే డాక్టర్ సలహాతో మందులు తీసుకుంటే.. డయాబెటీస్ రాకుండా జాగ్రత్తపడవచ్చు.
షుగర్ కంట్రోల్ లో ఉండాలన్నా లేక రాకుండా ఉండాలన్నా కచ్చితంగా జీవనశైలి మీద పట్టు ఉండాలి. ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు, ఎప్పుడు తింటున్నారు అన్నది కచ్చితంగా చాలా ముఖ్యం. సమయానికి నిద్రపోవడం చాలా ఇంపార్టెంట్. ఆందోళన, ఒత్తిడికి దూరంగా ఉండాలి. రక్తంలో షుగర్ లెవల్ ను జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉండాలి. మన నోటీని అదుపులో పెట్టుకోవాలి. అంటే ఏది పడితే అది రుచిగా ఉందని తినకూడదు. ముఖ్యంగా తీపిగా ఉండేవి తినకూడదు. ప్రాసెస్ చేసిన ఫుడ్ ని అస్సలు తీసుకోకూడదు. బరువు కంట్రోల్ చేసుకోవాలి. శారీరక శ్రమ కచ్చితంగా ఉండాలి. తగినంత వ్యాయామం చేయాలి. ఏం తిన్నా కానీ తక్కువగా తినాలి. కచ్చితంగా 6 నెలలకు ఒకసారైనా డాక్టర్ ని కలిసి పరీక్షలు చేసుకోవాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా జీవించడానికి వీలవుతుంది. ఇదీ సంగతి. ఇక ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.