iDreamPost
android-app
ios-app

పల్లీలు ఎక్కువగా తింటే ఆ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువట.. పరిశోధనలో షాకింగ్ విషయాలు

  • Published Nov 27, 2023 | 3:32 PM Updated Updated Nov 27, 2023 | 3:32 PM

బాదం, పిస్తా, వాల్ నట్స్ వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తారు. అవి తినలేని వారికి బెస్ట్ ఆప్షన్ పల్లీలు, వేరు శనగలు. అయితే వీటిని ఎక్కువగా తింటే ఆ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ అంటున్నారు పరిశోధకులు. ఆ వివరాలు..

బాదం, పిస్తా, వాల్ నట్స్ వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తారు. అవి తినలేని వారికి బెస్ట్ ఆప్షన్ పల్లీలు, వేరు శనగలు. అయితే వీటిని ఎక్కువగా తింటే ఆ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ అంటున్నారు పరిశోధకులు. ఆ వివరాలు..

  • Published Nov 27, 2023 | 3:32 PMUpdated Nov 27, 2023 | 3:32 PM
పల్లీలు ఎక్కువగా తింటే ఆ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువట.. పరిశోధనలో షాకింగ్ విషయాలు

ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు తీసుకోవాలి అంటూ వైద్యులు నిత్యం చెప్పే పదార్థాల్లో పల్లీలు, వేరు శనగలు ముందు వరుసలో ఉంటాయి. వీటిల్లో ప్రోటీన్‌లు, విటమిన్‌లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉంటాయి అని చెబుతారు. వీటిని మన ఆహారంలో భాగం చేసుకుంటే గుండెజబ్బులు వచ్చే ప్రమాదాన్ని నివారించడమే కాక.. బరువు కూడా తగ్గుతారని చెబుతారు వైద్యులు. అయితే వేరుశనగల వల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు.. కొన్ని నష్టాలు కూడా ఉన్నాయంటున్నారు వైద్యులు, పరిశోధకులు. వీటిని అతిగా తీసుకుంటే కొన్ని రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు పెరుగుతాయంటున్నారు. తాజాగా నిర్వహించిన పరిశోధనలో ఈ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు..

మన దగ్గర వేరుశనగలు ఆహారంలో ఓ భాగం. కాలక్షేపం కోసం స్నాక్స్ గా మాత్రమే కాక.. వంటల్లో కూడా ఎక్కువగా వాడుతుంటారు. ఇక వీటిలో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌(జీఐ) తక్కువుగా ఉండి, ప్రోటీన్‌లు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవే కాక ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల బాదంపప్పు, జీడిపప్పు వంటి ఖరీదైన నట్స్‌ తినలేకపోయిన కనీసం వేరుశెనగలను కచ్చితంగా తమ ఆహారంలో భాగం చేసుకుని వైద్యులు సూచిస్తారు. అందుకే చాలా మంది వీటిని తమ ఆహారంలో భాగం చేసుకుంటారు. వీటి వల్ల కలిగే ప్రయోజనాల్లో ముఖ్యంగా..ఈ పల్లీలు డయాబెటిస్‌ పేషంట్లకు మంచి ఆహారం అని వెల్లడయ్యింది అంటున్నారు

ఎలా తెలిసిందంటే..

ఇవి తింటే టైప్‌ 2 డయాబెటిస్‌ రాకుండా ఉంటుందనేది మాట వాస్తవమే అంటున్నారు వైద్యులు. ఇవి రక్తంలోని చక్కెరని ప్రభావితం చేసి ఇన్సులిన్‌ పెరగకుండా చేస్తాయని చెబుతున్నారు. అందువల్ల శరీరంలో చక్కెర స్థాయిలు పెరగవని అంటున్నారు. ఈ వేరుశెనగలో ఉండే గ్లూకోజ్‌ ఇండెక్స్‌(జీఐ) విలువ 13 ఉంటుంది. అందువల్ల చక్కెర కచ్చితంగా అదుపులో ఉంటుందంటున్నారు. అంతేగాదు ఉదయాన్నే వేరుశెనగ లేదా సంబంధిత ఉత్పత్తులను తినడం వల్ల రోజంతా రక్తంలోని చక్కెరని స్థాయిని పెరగకుండా నియంత్రిస్తుంది అంటున్నారు వైద్యులు.

పల్లీలు చక్కెర స్థాయిని తగ్గించడానికి ప్రధాన కారణం దీనిలో ఎక్కువ మొత్తంలో ఉండే మెగ్నీషియమే. ఈ వేరుశెనగలో సుమారు 12 శాతం మెగ్నీషియం ఉంటుందని.. ఇది గ్లూకోజ్‌ని బ్యాలెన్స్‌ చేస్తుంది అంటున్నారు వైద్యులు. అలాగే దీనిలో అసంతృప్త కొవ్వులు, ఇతర పోషకాలు అధికంగా ఉన్నందున ఇన్సులిన్‌ స్థాయిలను నియంత్రించడమే గాక వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయిని అధ్యయనంలో వెల్లడైంది. అయితే వీటి వల్ల ప్రయోజనాలు మాత్రమే కాక.. కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉందని తాజా పరిశోధనల్లో వెల్లడయ్యింది అంటున్నారు.

సంభవించే ప్రమాదాలు..

  • ఇందులో అధికంగా ఉండే ఒమెగా 6 కొవ్వు ఆమ్లాల వల్ల కొన్ని రకాల అలెర్జీలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు నిపుణులు.
  • ఈ ఒమెగా వల్లే మధుమేహం, ఊబకాయం వచ్చే ప్రమాదం కూడా ఉన్నట్లు తమ పరిశోధనలో తేలిందన్నారు శాస్త్రవేత్తలు.
  • మార్కెట్లో వేరుశెనగలు వేయించి ఉప్పు, పంచదార కలిపి అమ్ముతుంటారు. ఇలాంటి వాటి వల్ల మరితం ప్రమాదమని చెబుతున్నారు.
  • అంతేగాక దీనిలో అధికంగా ఉండే క్యాలరీల కారణంగా చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.
  • ఏదీఏమైనా ఆరోగ్యానికి ఎంత మేలు చేసేదైనా దాన్ని తగు మోతాదులో తినడమే మంచిదని సూచిస్తున్నారు వైద్యులు.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alKulisbetKulisbetberlinbetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş