iDreamPost
android-app
ios-app

Disha Patani : రామ్ చరణ్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని?

  • Published Jan 03, 2022 | 3:55 PM Updated Updated Jan 03, 2022 | 3:55 PM
  • Published Jan 03, 2022 | 3:55 PMUpdated Jan 03, 2022 | 3:55 PM
Disha Patani : రామ్ చరణ్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని?

పాన్ ఇండియా సినిమా RRR ని దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రమోట్ చేసిన రామ్ చరణ్, ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న కరోనా మరియు ఓమిక్రాన్ కేసుల కారణంగా, ప్రభుత్వ నిబంధనల్ని దృష్టిలో పెట్టుకొని RRR సినిమా విడుదల ఆపేసారు. ఇప్పుడు ఆ సినిమా వాయిదా పడటంతో, తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టాడు చరణ్. తన తదుపరి చిత్రం అయిన ఆచార్యపై దృష్టి సారించాడు మరియు ఈ సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఆచార్య ఫిబ్రవరి 4న విడుదల కానుంది.

ఇదిలా ఉంటే, చరణ్ సంచలన దర్శకుడు శంకర్‌తో ఒక చిత్రానికి సంతకం చేసాడు మరియు ఈ ప్రాజెక్ట్ ఇటీవలే సెట్స్ మీదకి వెళ్ళింది. ఇటీవల ముంబైలో ఈ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్ ని చిత్రీకరించారు. ఈ చిత్రం తర్వాత, చరణ్ ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వహిస్తున్న చిత్రం కోసం షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించనుంది.

ఈ చిత్రంలో కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని అయితే సరిగ్గా సరిపోతుంది చిత్రబృందం భావిస్తోందట. దిశా పటాని వరుణ్ తేజ్ నటించిన ‘లోఫర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం మరియు ఆమె బాలీవుడ్ చిత్రాలలో కూడా చాలా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

దిశా పటాని కి మార్షల్ ఆర్ట్స్ మరియు బాక్సింగ్ గురించి బాగా తెలుసు. ఇప్పుడు ఈ సినిమా కథ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందుతుండటంతో మేకర్స్ అనుకున్న పాత్రకు దిశా సరైన ఎంపిక. ప్రస్తుతం ఈ అంశంపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి, అధికార ప్రకటన త్వరలో వస్తుందని సమాచారం. చరణ్ కూడా తన సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు ఇరగదీస్తాడు. ఇక దిశా పటాని కూడా జోడైతే ఇక థియేటర్లలో ఫాన్స్ కి పండగే అని చెప్పొచ్చు.

Also Read : SS Rajamouli : రాజమౌళి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet girişjojobet giriş