గత సంవత్సరం వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాగా దిశ నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.
ఈ ఎన్‌కౌంటర్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ దిశ నిందితుల కుటుంబసభ్యులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
దిశా నిందితుల కుటుంబ సభ్యులు వేసిన పిటిషన్ ను విచారించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ఎన్‌కౌంటర్ పై ఇప్పటికే న్యాయ విచారణ కమిషన్ వేశామని సుప్రీం కోర్టు వెల్లడించింది. ఏం చెప్పాలనుకున్న న్యాయ విచారణ కమిషన్ కే చెప్పాలని నిందితుల కుటుంబాలకు సూచించిన సుప్రీం కోర్టు, పిటిషన్ ను ఉపసంహరించుకునే ఛాన్స్ కూడా వారికే ఇచ్చింది.
దిశ నిందితుల ఎన్‌కౌంటర్ లో నిజ నిర్దారణ కోసమే న్యాయ విచారణ కమిషన్ ను ఏర్పాటు చేశామని వెల్లడించిన సుప్రీం కోర్టు ఏదైనా చెప్పాలి అనుకుంటే న్యాయ విచారణ కమిషన్ కే చెప్పుకోవాలని నిందితుల కుటుంబాలకు సూచించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై దిశ నిందితుల కుటుంబాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.