iDreamPost
android-app
ios-app

ర‌జ‌నీని శంక‌ర్ ప‌దేళ్లు ముందు క‌లిసి ఉంటే ..?

  • Published Jan 05, 2018 | 5:10 AM Updated Updated Jan 05, 2018 | 5:10 AM
  • Published Jan 05, 2018 | 5:10 AMUpdated Jan 05, 2018 | 5:10 AM
ర‌జ‌నీని శంక‌ర్ ప‌దేళ్లు ముందు క‌లిసి ఉంటే ..?

భార‌తీయ వెండితెర‌పై క‌నీవినీ ఎరుగ‌నంత అత్య‌ధిక‌ వ్య‌యంతో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం రోబో 2.  లైకా మూవీస సంస్థ ఈ చిత్రాన్నినిర్మిస్తోంది. ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌- సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు శంక‌ర్‌ల కాంబినేష‌న్‌లో సాంకేతిక అద్భుతంగా తెర‌కెక్కుతుందీ సైన్స్‌ఫిక్ష‌న్ మూవీ. అంతేకాదు .. దాదాపు ప‌దిహేను భాష‌ల్లో దేశ‌విదేశాల్లో ఈ చిత్రం అత్యంత భారీ స్థాయిలో విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టిదాకా భార‌తీయ సినిమాల పేరిట ఉన్న అన్ని చిత్రాల రికార్డుల‌ను తెర‌మ‌రుగు చేయ‌గ‌ల స‌త్తా ఉన్న చిత్రంగా ఇప్ప‌టికే  గొప్ప అంచనాలున్న ‘2.ఓ’ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్ష‌కుల‌ముందుకు వ‌స్తున్న‌ట్టు ర‌జ‌నీ స్వ‌యంగా ప్ర‌కటించిన విష‌యం తెలిసిందే..!

కాగా గ‌తంలో… సూప‌ర్‌స్టార్  రజనీకాంత్‌తో గ‌తంలో ‘శివాజి’, ‘ఎందిరన్‌’వంటి సూప‌ర్‌హిట్‌ చిత్రాలను తెరకెక్కించి ఇప్పుడు ‘2.ఓ’ను వెండితెర వండ‌ర్ గా ప్రేక్ష‌కుల‌ముందుకు తెస్తున్న ద‌ర్శ‌కుడు శంక‌ర్ ఈ చిత్రం గురించి హీరో ర‌జ‌నీకాంత్ పై త‌న‌కున్న అభిప్రాయం గురించి మ‌న‌సు విప్పి మాట్లాడారు.  ‘సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో పనిచేయడం ఓ మ్యాజిక్‌ లాంటిదే. ఆయనతో శివాజి, ఎందిరన్‌, 2.ఓ.. మూడు సినిమాలను తెరకెక్కించడం చాలా ఆనందంగా ఉంది. గతంలో నేను ఎన్నో సినిమాలు చేసినప్పటికీ.. రజనీకాంత్‌తో సినిమా తీయడానికి నాకు 11 ఏళ్లు పట్టింది. సూపర్‌స్టార్‌ వద్దకు వెళ్లడం అంత సులభం కాదు. ఇంకా పదేళ్ల ముందుగానే ఆయన్ను కలిసి ఉంటే మరో మూడు సినిమాలు చేసే అవకాశాన్ని పొందేవాడిని’ అని ద‌ర్శ‌కుడు శంక‌ర్ వ్యాఖ్యానించ‌డం విశేషం. నిజానికి శంక‌ర్ రోబో క‌థ‌ను మ‌రో స్టార్ హీరో క‌మ‌ల్‌హాస‌న్‌ను దృష్టిలో పెట్టుకుని త‌యారుచేశాన‌ని  గ‌తంలో అత‌డే స్వ‌యంగా వెల్ల‌డించ‌డం గుర్తుంచుకోవాలి. కానీ త‌న సొంత సినిమాల‌తో క‌మ‌ల్ బిజీగా ఉండ‌టంతో ఆ చిత్రంలో ర‌జ‌నీ న‌టించారు.  ఇప్ప‌డువ‌స్తున్న ‘2.ఓ’ దాని సీక్వెల్‌గా వ‌స్తున్న‌దే…!

Jojobet GirişJojobetcasibomjojobetjojobetcasibomcasibomcasibomcasinomilyonşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetJojobetStarzJojobetStarzbetjojobet güncel girişgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom