iDreamPost
android-app
ios-app

Telangana: ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డ్.. ఈరోజు నుంచి ప్రారంభం!

  • Published Oct 03, 2024 | 11:51 AM Updated Updated Oct 03, 2024 | 11:51 AM

Telangana: ప్రతి కుటుంబానికీ ఒక డిజిటల్‌ కార్డు ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన పనులు మొదలు పెట్టింది.

Telangana: ప్రతి కుటుంబానికీ ఒక డిజిటల్‌ కార్డు ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన పనులు మొదలు పెట్టింది.

Telangana: ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డ్.. ఈరోజు నుంచి ప్రారంభం!

ప్రతి వ్యక్తికి గుర్తింపు కోసం ఆధార్‌ కార్డు ఉంటుంది. అదే విధంగా ప్రతి కుటుంబానికీ ఒక డిజిటల్‌ కార్డు ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించిన పనులు మొదలు పెట్టింది. ప్రజలు సులభంగా, తొందరగా రాష్ట్రంలో ఎక్కడైనా సేవలు పొందేందుకు ఈ ఫ్యామిలీ డిజిటల్‌ కార్డులు ఉపయోగపడతాయి. అందుకే ప్రభుత్వం వాటిని అందుబాటులోకి తీసుకు వస్తుంది. ఈ కార్డుల సర్వే అక్టోబర్ 3 నుంచి ప్రారంభం అవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి. వాటితో పాటు మిగతా పథకాలని కూడా అమలు చేసే విధంగా ఈ డిజిటల్ కార్డులు ఉపయోగపడతాయి. కుటుంబ కార్డులు లాగే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులను ఇవ్వనున్నారు. ప్రతి ఫ్యామిలీకి కూడా ఒక గుర్తింపు నంబర్ ఉంటుంది. అలాగే కుటుంబంలోని సభ్యులకు వ్యక్తిగత నంబర్లు కూడా ఉంటాయి. కుటుంబ వివరాలన్ని జాగ్రత్తగా సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే దేశంలో కొన్ని రాష్ట్రాలలో ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అమలు అవుతున్నాయి. మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, హరియాన వంటి రాష్ట్రాల్లో ఈ కార్డులని అమలు చేస్తున్నారు. ఆ రాష్ట్రాలలో ఈ డిజిటల్‌ కార్డుల విధానాన్ని మన అధికారులు పరిశీలించారు. అన్నింటిని జాగ్రత్తగా అధ్యయనం చేశారు. ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడేలా మార్పులు చేస్తూ కొత్తగా అమలు చేయాలని ప్రభుత్వం చూస్తోంది. ప్రస్తుతానికి అయితే ఈ కార్డులను వైద్యారోగ్య, పౌరసరఫరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలకు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఇంకా ఇతర సేవలను కూడా కలపాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో పైలట్‌ ప్రాజెక్టుగా 119 పట్టణాలు, 119 గ్రామాల్లో ఈ ఫ్యామిలీ డిజిటల్‌ కార్డులని ఇస్తున్నారు. ఆరోగ్య శ్రీ కార్డుల స్థానంలో వీటిని ఇవ్వనుంది ప్రభుత్వం.

155 మంది సిబ్బందితో 36 బృందాలను ఏర్పాటు చేసింది. ప్రతి బృందంలో నలుగురు నుంచి ఆరుగురు సభ్యులు, ఒక ఫొటోగ్రాఫర్‌ ఉంటారు. ప్రతి టీమ్‌కు ఒక తాసీల్దార్‌, ఎంపీడీఓ ఉంటారు. పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్‌ కమిషనర్‌, మండల స్ధాయిలో అందుబాటును బట్టి మండల అధికారులు, ఒక ఫొటోగ్రాఫర్‌ ఉంటారు. ప్రతి రోజు ఒక్కో బృందం 30 కుటుంబాల చొప్పున 5 రోజులపాటు 150 ఇళ్లకు వెళ్తుంది. మొత్తం 5,400 కుటుంబాల వివరాలను తీసుకుంటారు. వారి వివరాలు నమోదు చేసుకొని ఏవైనా మార్పులు ఉంటే చేస్తారు. కుటుంబ సభ్యులందరి సమ్మతం ప్రకారం కార్డు కోసం ఫొటో తీసుకుంటారు. ఈ సర్వే పర్యవేక్షణకు ఆరుగురు ప్రత్యేక అధికారులను నియమించారు. దీన్ని ఐదు రోజుల్లో పూర్తి చేసి, ఈ నెల 7లోపు వివరాలను సమర్పించనున్నారు. మరి ప్రభుత్వం తీసుకున్న ఈ డిజిటల్ కార్డుల నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.