iDreamPost
android-app
ios-app

చపాతీలు ఇన్ని రకాలుగా చేసుకోవచ్చు.. వీటితో చేసిన చపాతీ తింటే..

  • Published Jun 09, 2022 | 6:45 AM Updated Updated Jun 09, 2022 | 6:45 AM
చపాతీలు ఇన్ని రకాలుగా చేసుకోవచ్చు.. వీటితో చేసిన చపాతీ తింటే..

ఈ మధ్య కాలంలో అందరూ బరువు తగ్గాలని, అరగడానికి ఈజీగా ఉండాలని చాలా మంది రాత్రి పూట చపాతీ తింటున్నారు. డయాబెటిస్ ఎక్కువగా ఉన్నవారు చపాతీలు ఎక్కువగా తింటారు. చపాతీలలో చాలా తక్కువ క్యాలరీలు, ఫైబర్ ఎక్కువ ఉంటాయి. రోజూ గోధుమ పిండి చపాతీలు ఆహారంలో భాగంగా తీసుకుంటే కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది కాబట్టి రోజూ చపాతీలు గోధుమపిండి తోనే కాకుండా సజ్జ పిండి, రాగి పిండి, ఓట్స్ పిండి, క్వినోవా పిండి, తోటకూర విత్తనాల పొడి వంటి వాటితో కూడా చపాతీలను తయారు చేసుకోవచ్చు.

సజ్జ పిండి, తోటకూర విత్తనాల పిండిలలో గ్లూటన్ ఉండదు. వీటిలో ఉండే ప్రోటీన్లు, ఫైబర్ లు బరువు తగ్గడానికి సహాయపడతాయి. రొట్టెలు అనేవి అన్నం కాకపోయినా మన కడుపు నిండినట్లుగా ఉంటుంది. దీనివలన తక్కువగా తింటారు, తొందరగా ఆకలి వేయదు. ఓట్స్ పిండితో తయారైన చపాతీలలో కార్బోహైడ్రాట్స్ అధికంగా ఉంటాయి. ఇది మన శరీరంలో ఉండే శక్తిస్థాయిలు తగ్గకుండా చేస్తుంది. ఇది రక్తంలో చక్కర స్థాయిలు కంట్రోల్ లో ఉంచుతుంది. ఓట్స్ పిండిలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తాయి.

క్వినోవా పిండిలో అనేక రకాల అమైనో ఆమ్లాలు, మెగ్నీసియం, కాపర్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి, జీవక్రియ పని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. రాగి పిండిలో ప్రోటీన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి మధుమేహాన్ని తగ్గిస్తాయి, బరువును తగ్గించడానికి ఉపయోగపడతాయి. రోజూ చపాతీలు తినే వారు రోజూ గోధుమపిండితో మాత్రమే కాకుండా పైన చెప్పిన అన్ని రకాల పిండిలను వాడొచ్చు. దీనివల్ల మనం రోజూ చపాతీలను తిన్నట్టు ఉంటుంది, అంతేకాకుండా ఒకటే రకం తింటున్నాము అన్న ఫీలింగ్ కూడా ఉండదు మరియు ఆరోగ్యానికి మంచి పోషకాలను అందించినట్లే.