ఏపీ సీఎం వైఎస్ జగన్ ముందు అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడిన మేఘన, ఆరోజు నుంచి హాట్ టాపిక్ ఆఫ్ ఏపీగా మారింది.ఇటీవలే ఏపీలో విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో ఆమె ఫెయిలైందంటూ కొన్ని పుకార్లు వచ్చాయి. ప్రతిపక్షాలు సైతం ఆమె పాస్ అయిదా? లేదా? అంటూ ఆరాలు తీశాయి.
తూర్పు గోదావరి జిల్లా బెండపూడి పాఠశాలలో చదువుతున్న తోలెం మేఘన పదో తరగతిలో 478 మార్కులతో పాసైంది. ఇంగ్లీషులో ఆమె టాలెంట్ ఏంటో అందరికీ తెలిసిందే. ఇక మిగతా సబ్జెక్టుల్లోనూ ఆమె మంచి ప్రతిభ కనబర్చిందని మార్కులే చెప్తున్నాయి. కానీ ప్రతిపక్షాలు మాత్రం అందుకు భిన్నంగా రాజకీయాలు చేస్తూ ఒక విద్యార్థి భవిష్యత్తుకు ఆటంకం కలిగిస్తున్నాయి.
సీఎం జగన్ ముందు ఏ బెరుకు లేకుండా ఆంగ్లంలో అదరగొట్టింది మేఘన. అయితే ఆమెను కేవలం ఇంగ్లీషు పైనే దృష్టి పెట్టిస్తూ ప్రజల్ని మభ్యపెడుతున్నారని ఆరోపించాయి ప్రతిపక్షాలు. అసలు ఆమె టెన్త్ పరీక్షల్లో ఫెయిలైందని పుకార్లు సైతం పుట్టించారు. సోషల్ మీడియా వేదికగా ఇంకొంత మంది ట్రోలింగ్ కు దిగారు.
ఎంతో ప్రపంచాన్ని చూడాల్సిన అమ్మాయి మానసికంగా ఇబ్బంది పడుతుందనే కనీస ఆలోచన లేకుండా ప్రవర్తించారు. కానీ ప్రతిపక్షాలు అనుకున్నది ఏదీ జరగలేదు. మొత్తంగా ఫేక్ న్యూస్ లతో చెలరేగిపోతున్న అందరికీ మేఘన టెన్త్ ఫలితాలు చెంపపెట్టులా మారాయి.