Idream media
Idream media
గత అనుభవం దృష్ట్యా వికేంద్రీకరణ అవసరం చాలా ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. అధికార వికేంద్రీకరణ అన్నది అభివృద్ధి చెందుతున్న సమాజంలో చాలా అవసరమని, ఒకే ప్రాంతంలో అభివృద్ధి జరగడం, సంపద పెరగడం సమంజసం కాదన్నారు. అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం రావచ్చని, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రకటనపై దేశవ్యాప్తంగా చాలాచోట్ల హర్షం వ్యక్తమవుతోందన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తుందని ఆయన తెలిపారు. సీఎం చెప్పిన ప్రతిదాన్ని వ్యతిరేకించటం చంద్రబాబుకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు.
మూడు రాజధానులు అంటే మూడు నగరాలు నిర్మించడం కాదనే విషయాన్ని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు అర్థంచేసుకోవాలని అంబటి హితవు పలికారు. రాజధాని అంటే ఒక శాసనసభ, ఒక హైకోర్టు, ఒక సచివాలయం, వారు నివసించే ఇళ్లు.. ఇలా ముఖ్యమైన భవనాలు నిరి్మంచడమని స్పష్టంచేశారు. ఆర్దికంగా చితికిపోయిన రాష్ట్రానికి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు.
గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానులు అవసరమని అభిప్రాయపడ్డారన్నారు. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాలు ఎవరికి వారు అభివృద్ధి చెందాలని కోరుకుంటారన్నారు. అలాగే, రాజధాని మారిస్తే భూములిచి్న రైతులు నష్టపోరని అంబటి అన్నారు. రైతుల ముసుగులో వ్యక్తిగత దూషణలకు దిగి సీఎంను అనరాని మాటలు అంటే సహించేదిలేదన్నారు.