iDreamPost
android-app
ios-app

IPL 2022 : కెప్టెన్ గా తప్పుకున్న జడ్డూ.. ధోని ఈజ్ బ్యాక్..

  • Published May 01, 2022 | 2:41 PM Updated Updated May 01, 2022 | 9:02 PM
IPL 2022 : కెప్టెన్ గా తప్పుకున్న జడ్డూ.. ధోని ఈజ్ బ్యాక్..

 

IPL 2022లో చెన్నై టీం కెప్టెన్ గా ధోని తప్పుకోగా జడేజాని కెప్టెన్ చేశారు. అయితే ఈ సీజన్ లో చెన్నై ఘోరమైన ప్రదర్శన చేస్తోంది. చెన్నై ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో రెండు మాత్రమే విజయం సాధించింది. వరుస మ్యాచ్ లు ఓడిపోతుండటంతో కెప్టెన్, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఒత్తిడికి గురయి ఆట మీద సరిగ్గా ఫోకస్ చేయలేకపోతున్నాడు. దీంతో తన ఆటని మెరుగుపరుచుకునేందుకు కెప్టెన్సీని వదిలేస్తానని ఫ్రాంచైజీ యాజమాన్యానికి తెలిపి కెప్టెన్సీని ధోనికి అప్పగించాడు.

దీంతో మరోసారి మహేంద్రసింగ్‌ ధోనీ చెన్నై జట్టుకి సారథిగా ఉండనున్నాడు. దీనిపై చెన్నై యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. CSK తన ట్విట్టర్ పేజీలో.. ”జడేజా CSK కెప్టెన్సీని తిరిగి MS ధోనికి అప్పగించబోతున్నాడు. రవీంద్ర జడేజా తన ఆటపై మరింత దృష్టి పెట్టడానికి కెప్టెన్సీని వదులుకోవాలని నిర్ణయించుకున్నాడు. CSKకి నాయకత్వం వహించమని MS ధోనిని అభ్యర్థించగా ధోని.. జడేజా తన ఆటపై దృష్టి పెట్టడానికి, CSKని నడిపించడానికి అంగీకరించాడు” అని తెలిపింది.

ధోని మరోసారి చెన్నై కెప్టెన్సీ చేపట్టడంతో చెన్నై అభిమానుల్లో ఆశలు మొలకెత్తాయి. చెన్నైని మరోసారి విజయతీరాలకి ధోని చేరుస్తాడని CSK ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి ఇకనుంచి ఆడబోయే మ్యాచ్ లలో CSKని ధోని ఎలా నడిపిస్తాడో చూడాలి.