iDreamPost
తమిళంలో చేసిన వడ చెన్నై, కర్ణన్ లాంటి విలక్షణ చిత్రాలు డబ్బింగ్ కాకపోవడం కూడా ఇక్కడి ప్రేక్షకుల్లో తన ఇమేజ్ ని ప్రభావితం చేసింది.
తమిళంలో చేసిన వడ చెన్నై, కర్ణన్ లాంటి విలక్షణ చిత్రాలు డబ్బింగ్ కాకపోవడం కూడా ఇక్కడి ప్రేక్షకుల్లో తన ఇమేజ్ ని ప్రభావితం చేసింది.
iDreamPost
రఘువరన్ బిటెక్ సూపర్ హిట్ తో తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న ధనుష్ ఆ తర్వాత దాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయాడు. తమిళంలో చేసిన వడ చెన్నై, కర్ణన్ లాంటి విలక్షణ చిత్రాలు డబ్బింగ్ కాకపోవడం కూడా ఇక్కడి ప్రేక్షకుల్లో తన ఇమేజ్ ని ప్రభావితం చేసింది. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ మూవీ గ్రే మ్యాన్ తో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ధనుష్ కొత్త సినిమా తిరు ఇవాళ థియేటర్లలో విడుదలయ్యింది. హఠాత్తుగా ఫిక్స్ చేసిన రిలీజ్ డేట్ కావడంతో ప్రమోషన్, పబ్లిసిటీకి టైం లేకపోయింది. దీంతో తిరుకి మినిమమ్ బజ్ లేక ఓపెనింగ్స్ చాలా డల్ మొదలయ్యాయి. మరి సినిమా ఎలా ఉందో రిపోర్ట్ లో చూసేద్దాం పదండి.
కాలేజీ చదువు మధ్యలోనే ఆపేసిన తిరు ఏకాంబరం(ధనుష్)ముద్దుపేరు పండు. తాత(భారతీరాజా)తో మంచి బాండింగ్ ఉన్న తిరుకి తండ్రి(ప్రకాష్ రాజ్)తో మాత్రం మాటలు ఉండవు. ఫుడ్ డెలివరీ బాయ్ గా జీవితాన్ని గడిపేస్తూ అదే అపార్ట్మెంట్ లో ఉండే స్నేహితురాలు శోభన(నిత్య మీనన్)తో అన్ని షేర్ చేసుకుంటాడు. ఈ క్రమంలో అనూష(రాశిఖన్నా), రంజని(ప్రియా భవాని)లను ప్రేమిస్తాడు కానీ వాళ్ళు అంగీకరించరు. అసలు తిరు లక్ష్యం ఏంటి, ఎందుకు నాన్నతో గ్యాప్ వచ్చింది, ఇద్దరమ్మాయిలలో చివరికి ఎవరిని గెలుచుకున్నాడు అనేదే అసలు కథ. ధనుష్ ఎప్పటిలాగే తన టైమింగ్ తో తిరు పాత్రలో ఒదిగిపోవడం యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. భారతీరాజా క్యారెక్టర్ తొలిప్రేమలో నగేష్ తరహాలో బాగా కుదిరింది. ఎటొచ్చి ప్రకాష్ రాజే మిస్ క్యాస్టింగ్ అనిపిస్తుంది.
దీనికి తోడు వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించడంతో డ్యామేజ్ ఇంకా పెరిగింది. కథాకథనాల్లో ఎలాంటి కొత్తదనం లేని తిరుని బోర్ కొట్టించకుండా నడిపించాలని దర్శకుడు మిత్రన్ ఆర్ జవహర్ ప్రయత్నించిన తీరు డీసెంట్ ఫలితాన్ని ఇచ్చింది. ఎక్కడా హై అనిపించే మూమెంట్స్ లేకపోయినా మరీ చిరాకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఏదో కొత్తదనాన్ని ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు. స్నేహం, దాచుకునే ప్రేమ కాన్సెప్ట్ మీద ఇప్పటికే బోలెడు సినిమాలు వచ్చిన నేపథ్యంలో ఇలాంటి కంటెంట్ థియేటర్ డిమాండ్ చేసేది కాదనిపిస్తుంది. అనిరుద్ సంగీతం అతని స్థాయిలో లేదు. పర్వాలేదనిపిస్తుంది. ఓవరాల్ గా ధనుష్ ని బాగా ఇష్టపడే వాళ్లకు తప్ప తిరు కంటెంట్ బేస్డ్ గ్రాండియర్స్ అలవాటు పడ్డ కామన్ ఆడియన్స్ ని గొప్పగా మెప్పించే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. జస్ట్ ఓకే క్యాటగిరీలో వేసేయొచ్చు.