iDreamPost
android-app
ios-app

వర్మ రాజ్యంలో దేవినేని ఉమ హత్య

వర్మ రాజ్యంలో దేవినేని ఉమ హత్య

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే సినిమా ఎట్టకేలకు నేడు విడుదలైంది.

ఏ ఒక్క క్యారెక్టర్ ను కావాలని తీయలేదని అవన్నీ యాదృచ్చికంగా జరిగాయని వర్మ చెప్తున్నా చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణి భువనేశ్వరి, దేవినేని ఉమా, విజయసాయిరెడ్డి, వైయస్ జగన్మోహన్ రెడ్డి, వైయస్ భారతి, పవన్ కళ్యాణ్, కే ఏ పాల్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అచ్చం నాయుడు, క్యారెక్టర్ల తో వర్మ మరింత కాంట్రవర్సీటికి తెరలేపాడు.  ముఖ్యంగా సినిమాలో టిడిపి నేత దేవినేని ఉమా క్యారెక్టర్ కు దగ్గరి పోలికలు ఉన్న దయనేని రమా పాత్రను, నారా బ్రాహ్మణి క్యారెక్టర్ కు దగ్గరి పోలికలు ఉన్నఉన్న రమణి హత్య చేయించడం ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతోంది.

ఎన్నికల్లో ఓటమిపాలైన తరువాత హత్యా రాజకీయాలు చేసి ఆ హత్యలను ముఖ్యమంత్రి జగన్నాథ రెడ్డిపై మోపాలని బాబు అండ్ కో పథకం వేస్తారు. ఎవరినో ఎందుకు ఈ మధ్య బాగా పాపులారిటీ సంపాదించిన దయనేని రమాను చంపుదామని రమణి అంటుంది.

ఈ పథకంలో భాగంగా గంగవీటి భవాని అనే క్యారెక్టర్ దయనేని రమా ను చంపటానికి తన అనుచరులను పంపి విజయవాడ నడిబొడ్డులో దయనేని రమాను చంపేస్తారు. దయనేని రమాను నరికి చంపిన వ్యక్తుల్లో బాబు వద్ద సెక్యూరిటీ గా పనిచేసే బ్రహ్మానందం క్యారెక్టర్ కూడా ఉంటుంది.ఈ సన్నివేశం చూసిన ఎవరికైనా ఆ పాత్రధారుల ఎవరో ఇట్టే అర్ధమవుతుంది.

సినిమా పరంగా ఎన్నో కాంట్రవర్సీటీలను మూటగట్టుకున్న రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా ద్వారా ఏం చెప్పదలచుకున్నారు అనేది సగటు ప్రేక్షకుడికి అర్ధం కాకపోగా రాజకీయంగా అనేక వివాదాలకు విమర్శలకు గొడవలకు ఈ సినిమా ఖచ్చితంగా తావిస్తుందనే చెప్పాలి.