iDreamPost
android-app
ios-app

అంతుచిక్కని వ్యవహారం.. కొలిక్కివచ్చినట్లేనా..?

అంతుచిక్కని వ్యవహారం.. కొలిక్కివచ్చినట్లేనా..?

ఏలూరులో అంతుచిక్కని వ్యధి వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లు పరిసితులు కనిపిస్తున్నాయి. ప్రజలు అనారోగ్యానికి గురికావడానికి కారణాలు ఏమిటన్న అంశంపై వైద్యాధికారులు తమ పరిశోధనలను విస్తృతం చేశారు. కోవిడ్‌ కాదని వైద్యులు ఇప్పటికే ప్రకటించగా.. అంటు వ్యాధి కూదని తేల్చారు. బాధితుల రక్త నమూనాల్లో లెడ్‌ హెవీ మెటల్, నికెల్‌ పదార్థాలు ఉన్నట్లు ఢిల్లీ ఎయిమ్స్‌ నిపుణుల బృందం గుర్తించింది. బ్యాటరీల్లో వాడే లేవీ హెడ్‌ మెటల్‌ ఆహారం, నీళ్లు, పాల ద్వారా బాధితుల శరీరంలోకి వచ్చినట్లు అనుమానిస్తున్నారు.

లెడ్‌ హెవీ మెటల్, నికెల్‌ పదార్థాలు ఉన్నందువల్లనే బాధితులు కళ్లు తిరిగిపడిపోవడం, మూర్చ రావడం, నోటి నుంచి నురగలు రావడం వంటì లక్షణాలతో అస్వస్థతకు గురవుతున్నారని ప్రాథమికంగా గుర్తించారు. బాధితుల్లో కంటికి సంబంధించిన నల్లగుడ్డు స్పందన తగ్గిన లక్షణాన్ని వైద్యులు గుర్తించారు. దీన్ని వైద్య పరిభాషలో ప్యూపిల్‌ డైలటేషన్‌ అని వైద్యులు చెబుతున్నారు. మయో క్లోనిక్‌ ఎపిలెప్సీ కూడా కావచ్చని గుంటూరు వైద్యు నిపుణులు పేర్కొంటున్నారు.

ఏలూరు వ్యవహారంపై సీఎం వైఎస్‌ జగన్‌ నిత్యం ఆరా తీస్తున్నారు. నిన్న సోమవారం ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో బాధితులను పరామర్శించిన సీఎం వైఎస్‌ జగన్‌ వారికి ధైర్యం చెప్పారు. వైద్య పరీక్షల నివేదికలపై సీఎం జగన్‌ ఈ రోజు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎయిమ్స్‌ వైద్యనిపునులు నిర్వహించిన పరీక్షల్లో లెడ్‌ హెవీ మెటల్, నికెల్‌ వంటి మూలకాలు ఉన్నట్లు గుర్తించారని వైద్యులు సీఎం వైఎస్‌ జగన్‌కు తెలిపారు. మరికొన్ని పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని చెప్పారు. సీసీఎంబీ, ఐఐసీటీ పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత వింత వ్యాధి ఎందుకు వస్తుందన్న అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ రోజు సాయంత్రం లేదా రేపటికి అన్ని పరీక్షల ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ ఘటన, అనంతర పరిణమాలపై సీఎం వైఎస్‌ జగన్‌ రేపు బుధవారం వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నట్లు సీఎంఓ తెలిపింది.