iDreamPost
android-app
ios-app

ఆ అభిప్రాయాన్ని మార్చేస్తున్న వైఎస్‌ జగన్‌.!

ఆ అభిప్రాయాన్ని మార్చేస్తున్న వైఎస్‌ జగన్‌.!

ప్రభుత్వంతో కూడిన ఏ పని అయిన నిదానంగా జరుగుతుంది. ఓపిక ఉండాలి. పలుమార్లు తిరగాలి. నిర్ణయం తీసుకున్నంత మాత్రాన వెంటనే జరగదు. నెలలు, ఏళ్లు అయినా పట్టవచ్చు… ఇదీ నిన్న మొన్నటి వరకూ ప్రభుత్వాలు పని చేసే తీరుపై ప్రజల్లో ఉన్న భావన. అయితే ఈ భావనను ఆంధ్రప్రదేశ్‌ యువ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పూర్తిగా మార్చివేస్తున్నారు. వేగంగా నిర్ణయాలు తీసుకోవడమే కాదు.. వాటిని అంతే వేగంగా అమలు చేస్తున్నారు. పథకమైనా, కార్యక్రమమైనా, విధానపరమైన నిర్ణయం అయినా.. ఏదైనా సరే ఎంత స్పీడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారో.. అంతే స్పీడుగా వాటిని అమలు చేస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు.

రెండు రోజుల క్రితం జరిగిన మంత్రి మండలిలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో మహిళల ఆధ్వర్యంలో సహకార సంఘాల ద్వారా పాల సేకరణ, 5 ఏళ్ల శిక్ష కాలాన్ని పూర్తి చేసుకున్న మహిళా ఖైదీల విడుదల కూడా ఉన్నాయి. మంత్రి మండలి నిర్ణయం తీసుకున్న వెంటనే.. సంబంధింత మంత్రులు ఈ నిర్ణయాలను అమలు చేసేందుకు రంగంలోకి దిగారు.

ఈ నెల 20వ తేదీ నుంచి సహకార సంఘాల ద్వారా పాల సేకరణ ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకు కోసం అమూల్‌ సంస్థ అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించింది. 20 నుంచి పాలు సేకరించి, అందుకు సంబంధించిన బిల్లులను 25వ తేదీన మహిళల ఖాతాల్లో జమ చేసే విధానాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ లాంఛనంగా ప్రారంభిస్తారని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు వెల్లడించారు.

మహిళా ఖైదీల విడుదలపై హోం మంతిర మేకతోటి సుచరిత కసరత్తు పూర్తి చేసి వివరాలు వెల్లడించారు. జీవిత ఖైదు పడిన మహిళల్లో 5 ఏళ్లు శిక్ష కాలం పూర్తి చేసుకుని, 48 ఏళ్లు నిండిన మహిళలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సుప్రిం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర మంత్రిమండలి ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలోని కేంద్ర కారాగారాల్లో శిక్ష అనుభవిస్తున్న వారిలో 55 మంది విడుదలకు అర్హత సాధించినట్లు హోం మంత్రి సుచరిత తెలిపారు. కడప కేంద్ర మహిళా కారాగారం నుంచి 27 మంది, రాజమహేంద్రవరం కేంద్ర మహిళా కారాగారం నుంచి 21 మంది, నెల్లూరు కేంద్ర మహిళా కారాగారం నుంచి ఐదుగురు, విశాఖ కేంద్ర మహిళా కారాగారం నుంచి ఇద్దరు చొప్పన విడుదల కానున్నారు. వారం రోజుల్లో వీరందరిని విడుదల చేయనున్నారు.