ఒకపక్క దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరొనా వైరస్ వ్యాప్తిని ఎలాగైనా అడ్డుకోవాలనే ఉద్దేశంతో కెంద్ర ప్రభుత్వంతో సహ కొన్ని రాష్ట్రలు కూడా లాకౌట్ దిశగా ముందుకెళుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో దేశవ్యాప్తంగా జనజీవనం స్తంబిచడం తో మరి ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్రజలందరూ ఇళ్ళకే పరిమితమవ్వాల్సిన పరిస్తితి.
కాగ, జనతా కర్ఫ్యు కారణంగా ఆదివారం ఒక్కరొజే ఇండియాలో ఇంటర్నెట్ వినియోగం సాధారణం కంటే మూడు రెట్లు పెరిగిందని పలు అంతర్జాతియ ఐటీ సంస్థల అధ్యయనంలో తేలింది. ప్రపంచ వ్యాప్తంగా సగటున సెకనుకు సగటున 60-70 వేల జీబీ డేటా వినియోగిస్తుండగా ఆదివారం మాత్రం రికార్డ్ స్థాయిలో 90 వేల నుండి లక్ష జీబీల డేటా వినియోగం నమోదయింది. ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగంలో భారత్ వాటా 9% వరకు ఉండగా జనతా కర్ఫ్యూ కారణంగా ఒక్క ఆదివారం ఒక్కరొజే ఇది 23 శాతానికి చేరడం విశేషం. భారత్ లో అత్యధికులు వినోదం కోసం YouTube నే వీక్షిస్తున్నారని అధ్యయనంలో తేలింది.
ఇదిలా ఉంటే కరొనా వైరస్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగింది. గడచిన నాలుగురొజుల్లొనే తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్నెట్ వినియోగం 25 నుండి 30 శాతం పెరిగిందని, రానున్న రోజుల్లో ఈ డిమాండ్ మరింతగా పెరిగే అవకాశం ఉందని టెలికాం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు పేర్కొంటున్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో రిలియన్స్ జియో చందాదారులు సగటున రోజుకి 5 వేల టెట్రాబైట్ డేటా ను వినియోగిస్తుంటే ఇప్పుడది 6 నుండి 7 వేల టెట్రాబైట్స్ కు పెరిగింది. గతంలో ఆంధ్రా తెలంగాణ లో జియో వినియోగదారుడు నెలకు11 నుండి 15 జీబీ డేటా వాడితే ఇప్పుడది మరో 30 శాతం పెరుగుతుందని ఆసంస్థ అంచనా వేస్తుంది.
కరొనా ప్రభావంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగస్థులు, వ్యాపారులు ఇంటినుండి పని చెయ్యడానికే మొగ్గు చూపడంతో హైద్రాబాద్, బెంగుళూరులలో డేటా కు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది.పెరుగుతున్న డిమాండ్ కు తగట్టు పూర్తి సన్నద్దతతో ఉన్నామని, డేటా ట్రాఫిక్ పెరిగినా నెట్వర్క్ లు స్తంభించకుండా ప్రొవైడర్లు తమ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా పెరుగుతున్న డిమాండ్ ని క్యాష్ చేసుకోవడానికి జియో, ఎయిర్ టెల్ లాంటి సంస్థలు తమ వినియోగదారులను ఆకర్శించడానికి సరికొత్త డేటా టాపప్ పధకాలను ప్రవేశపెడుతున్నాయి. ఈ లాక్ డౌన్ పుణ్యమా అని ఒక్కసారిగా ల్యాప్టాప్ లు, డెస్క్ టాప్ లు, డాంగిల్స్ కు డిమాండ్ భారీగా పెరిగింది.