P Krishna
IMD Alert: పది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కాస్త గట్టిగానే కొడుతున్నాయి. వర్షాల కారణంగా జలాశయాలు, కుంటలు, చెరువులు నిండిపోయి పొంగి పొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లోని రహదారులు నీటితో నిండిపోయాయి.
IMD Alert: పది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కాస్త గట్టిగానే కొడుతున్నాయి. వర్షాల కారణంగా జలాశయాలు, కుంటలు, చెరువులు నిండిపోయి పొంగి పొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లోని రహదారులు నీటితో నిండిపోయాయి.
P Krishna
ఈ ఏడాది మార్చి నుంచే ఎండలు విపరీతంగా దంచి కొట్టాయి. ప్రజలు అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోలేక అల్లల్లాడిపోయారు. జూన్ మాసం నుంచి వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవించాయి. వరుణుడు కరుణించాడు. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు బటపడటం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగ వర్షాలు పడుతున్నాయి.నేడు(జులై 15)రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరింది.ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరించింది. వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో ఆదివారం భారీ వర్షం కురిసింది.. హైదరాబాద్ లో కురిసిన కుంభవృష్టితో తడిసి ముద్దయ్యింది. వర్షం కారణంగా పలు చోట్ల రహదారులు చెరువులను తలపించాయి. వాహనదారులు రాకపోకలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రి 10 గంటల వరకు నగరంలో సగటున 8.9 సెంటీ మీటర్ల వర్షంపాతం నమోదయ్యింది. నగరంలోని చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, గోల్కొండ, పంజాగుట్ట, కుకట్ పల్లి, ఉప్పల్, శేర్ లింగం పల్లి తో సహా పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. సోమవారం కూడా నగరంలో భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఆయా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ జిల్లాలతో పాటు హైదరాబాద్, ఆదిలాబాద్, జగత్యాల, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ సూచించింది. ఇక ఏపీలో కొన్ని ప్రాంతాలను వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. నేడు ఏపీలో రాయలసీమ, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. ఉపరిత గాలులు గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఛాన్స్ ఉందని అంచనా వేశారు అధికారులు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాల్సిందిగా సూచించారు.