iDreamPost
android-app
ios-app

పవన్ సుజిత్ కాంబో – ఇదీ అసలు కథ

  • Published Sep 05, 2022 | 4:12 PM Updated Updated Sep 05, 2022 | 4:12 PM
పవన్ సుజిత్ కాంబో – ఇదీ అసలు కథ

ఇవాళ ఉదయం నుంచి పలు వెబ్ సైట్లలో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతుందని, ఆర్ఆర్ఆర్ నిర్మాత డివివి దానయ్య తెరకెక్కిస్తారని ఇలా పెద్ద ప్రచారమే జరిగింది. గతంలో వీళ్ళు తమిళ హిట్ మూవీ తేరి రీమేక్ కోసం ఓ ప్రాజెక్టు అనుకున్న మాట వాస్తవమే. అయితే ఇప్పుడది అవుట్ డేటెడ్ అనిపించడం, దాని తెలుగు డబ్బింగ్ వెర్షన్ మన జనాలు విస్తృతంగా చూసేయడం జరిగిపోయాయి. కాటమరాయుడు టైంలో జరిగిన పొరపాటు ఇదే. అందుకే మళ్ళీ రిపీట్ చేయకుండా తేరిని తీసే ఆలోచన విరమించుకున్నారు. ఆ మాటకొస్తే అదో రొటీన్ పోలీస్ స్టోరీ. పెద్ద కొత్తదనమేం ఉండదు.

ఇప్పుడీ వార్త చాలా దూరం వెళ్లిపోవడంతో డివివి సంస్థ స్పందించింది. ఫ్యూచర్ లో చేయబోయే ఏ సినిమా అయినా స్వయంగా ప్రకటిస్తామని పుకార్లను నమ్మొద్దని తేల్చి చెప్పేసింది. సో పైన చెప్పిందంతా గాసిప్ అనే క్లారిటీ ఇచ్చేశారు.

నిజానికి పవన్ కొత్త కమిట్ మెంట్స్ ఇచ్చే పరిస్థితిలో లేడు. ఒకపక్క హరిహరవీరమల్లు పూర్తి చేయాలి. చాలా బాలన్స్ ఉంది. షూటింగ్ అయిపోయినా ప్రమోషన్ తాలూకు పనులుంటాయి. ఇంకోవైపు భవదీయుడు భగత్ సింగ్ స్క్రిప్ట్ చేతిలో పెట్టుకుని హరీష్ శంకర్ ఎదురు చూస్తున్నాడు. మైత్రి సంస్థ బడ్జెట్ ఎప్పుడో సిద్ధం చేసింది. ఇవి చాలవన్నట్టు వినోదయ సితం రీమేక్ ని చేయాలా వద్దా అనే చర్చ ఇంకా కొలిక్కి రానే లేదు.

ఇంత కన్ఫ్యూజన్ మధ్య పవన్ ఎవరికైనా మాట ఇవ్వడం కష్టం. అందుకే సాహో దర్శకుడైనా ఇంకొకరైనా చేసే ఛాన్స్ దగ్గరలో లేదు. 2024లో ఎన్నికలు వస్తాయి. దానికన్నా కనీసం ఆరేడు నెలలు ముందు ప్రచారం ఇతరత్రా పనుల కోసం ఖాళీగా ఉంచుకోవాలి. అలాంటప్పుడు వరసగా సినిమాలు చేసే తీరిక ఉండదు. ఒకవేళ ఒప్పుకున్నా నిర్మాతలు ఆలస్యం వల్ల కలిగే భారాన్ని అంత సులభంగా తట్టుకోలేరు. పాపం ఎటొచ్చి సుజిత్ కే టైం సెట్ కావడంతో లేదు. ముందు లూసిఫర్ రీమేక్ చేతికొచ్చింది. తన వెర్షన్ చిరంజీవికి నచ్చక మోహన్ రాజాకు వెళ్ళింది. గోపీచంద్ తో యువి వాళ్ళు ఓ మూవీ ప్లాన్ ఉందన్నారు. తీరా చూస్తే అదీ నో సౌండ్. ఫైనల్ గా సుజిత్ కి దొరికే హీరో ఎవరో