iDreamPost
iDreamPost
బ్రెడ్ లు, జామ్ లు, క్రీములు, లోషనలు, ఏదైనా సరే గడువు దాటిన తర్వాత వాటిని ఎవ్వరూ కొనరు. ఎందుకంటే, అందులో వాడేవాటికి ఒక ఎక్స్‌పైరీ డేట్ అంటూ ఒకటి ఉంటుంది. కాబట్టి మనం అర్ధం చేసుకోవచ్చు. మరి వాటర్ బాటిల్ లో ఉండేది స్వచ్ఛమైన నీళ్లే కదా!. వాటికి ఎందుకు గడువు ఉంటుంది? నదుల్లో, చెరువుల్లో చాలా వందలు, వేల ఏళ్ల నుంచి మంచి నీరు ఉందికదా! వాటిని మనం తాగుతాం. వాటికి లేని గడువు, ఇంకా శుభ్రపరిచిన బాటిల్ వాటర్ కు ఎందుకు ఉంటుంది?
దీనికో సమాధానముంది. ఇక్కడ ఎక్స్‌పైరీ డేట్ ఉంది నీటికికాదు. దాన్ని ప్యాక్ చేసిన ప్లాస్టిక్ బాటిల్ కు. ప్లాస్టిక్ లో నిల్వ ఉంచిన ప్రతిదానికి ఒక గడువు ఉండాల్సిందే. ఇది చట్టం.
వాటర్ నాచురల్ గా దొరికేది. నీటిని మనం తాగుతాం. అంటే ఫుడ్ కుండే అన్ని నిబంధనలూ వాటర్ కి వర్తిస్తాయి. ఇతర ప్యాకేజ్డ్ ఫుడ్ కుంటే అన్ని రకాల నిబంధనలు పాటించి తీరాల్సిందే. ఫుడ్ కి చాలా రకాల ఫంగస్, బ్యాక్టీరియా చేరుతుంది. నీటికి కూడా అంతే. నీరు శుభ్రంగా లేకపోతే కనీసం ఐదురకాల వ్యాధులు వస్తాయి. దానికితోడు వాటర్ క్వాలిటీకి గ్యారెంటీ కావాలి. కంపెనీ గ్యారెంటీ ఇచ్చినా, ఒకవేళ రోగాలొస్తే?
అందుకే బాటిల్ వాటర్ ను తయారుచేసే కంపెనీలు ఎక్స్‌పైరీ డేట్ ఇస్తాయి. దాని పక్కనే ఎక్కడ నిల్వ చేయాలి? ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో స్టోర్ చేయాలో కూడా చెబుతాయి. ఒకవేళ ఒక కంపెనీ వాటర్ బాటిల్ తాగి, ఎవరికైనా ఏమైనా అయితే, కోర్టుల్లో కేసులు పెడితే, అప్పుడు ఇదీ ఎక్స్‌పైరీ డేట్ , అప్పటిదాకా ఇలాంటి కండీషన్లలో స్టోర్ చేయాలంటూ చెబుతాయి. మీరు ఇలా దాచుకోలేదుకాబట్టి, మాకు ఎలాంటి సంబంధంలేదని తప్పించుకోవచ్చు. దీన్నే బ్రాండ్ డిఫెన్స్ అంటారు. అందుకే నీటికి కూడా ఎక్స్‌పైరీ డేట్ వుంటుంది.