iDreamPost
iDreamPost
ఒకచోట భూమిని తవ్వుతుంటే వజ్రాలు దొరికాయి అని ఎవరైనా ప్రచారం చేశారనుకోండి… గుడ్డిగా కొంతమంది నమ్మెస్తారు. అక్కడు పరుగులు పెడుతారు. ఆ ప్రాంతానంతటినీ తవ్విపారేస్తారు. ఆశే వాళ్లను పరుగెత్తిస్తుంది. లేటెస్ట్ గా… గుట్టలుగా బంగారం దొరుకుతుందని పుకార్లు వచ్చాయి. ఇంకేముంది జనాలు అక్కడికి ఉరుకుతున్నారు. అసలు బంగారం ఎక్కడ దొరుకుతుందని పుకార్లు వచ్చాయి తెలుసా? సముద్రంలో. అక్కడ బంగారం దొరకడం ఎలా సాధ్యం అని ఒక డౌట్ రావొచ్చు. అయితే… వారి నమ్మకానికి ఓ కారణం ఉంది. కొద్దిరోజుల క్రితం బంగారు రంగులో ఓ రథం కొట్టుకరావడమే.
శ్రీకాకుళం జిల్లాలోని సంత బొమ్మాళి మండలంలోని సున్నా రేవుకి రథం కొట్టుకొచ్చింది. అసని తుఫాను దెబ్బకు ఎక్కడనుంచో ఇది కొట్టుకువచ్చింది. ఇలా రథంలాగే సముద్రంలో నుండి బంగారం కొట్టు కొస్తోందని పుకార్లు వ్యాపించాయి. అంతే స్థానికులు, ఇతర ప్రాంతాల వారు సముద్రం వైపుకు పరుగులు తీస్తున్నారు. సముద్రంలోకి దూకుతున్నారు. అసలే అసని తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. ప్రజలు మాత్రం డోంట్ కేర్. సముద్రం ఒడ్డున ఉన్న ఇసుకలో తెగ వెతుకుతున్నారు. ఎవరికి బంగారం దొరుకుతుందా అని చుట్టుపక్కల వారిని చూస్తున్నారు. చివరిలో ట్విస్ట్ ఏంటంటే, ఒడ్డులో ఇసుక తప్పించి బంగారం లేదన్న సంగతి చివరకు అర్థమైంది.