iDreamPost
android-app
ios-app

ఓనర్‌కి తెలియకుండా 21 బైక్స్ అమ్మి.. 5 కోట్లు కొట్టేసిన ఉద్యోగి!

నమ్మకంగా ఉంటూ మోసానికి పాల్పడుతున్నారు కొందరు. ముఖ్యంగా కొంత మంది ఉద్యోగస్థులు అన్నం పెట్టిన కంపెనీకే సున్నం పెడుతున్నారు. యజమానికి ద్రోహం చేస్తున్నారు. తాజాగా అటువంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

నమ్మకంగా ఉంటూ మోసానికి పాల్పడుతున్నారు కొందరు. ముఖ్యంగా కొంత మంది ఉద్యోగస్థులు అన్నం పెట్టిన కంపెనీకే సున్నం పెడుతున్నారు. యజమానికి ద్రోహం చేస్తున్నారు. తాజాగా అటువంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

ఓనర్‌కి తెలియకుండా 21 బైక్స్ అమ్మి.. 5 కోట్లు కొట్టేసిన  ఉద్యోగి!

తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టారన్న సామెత ఉంది. అంటే అన్నం పెట్టిన వాడికి అపకారం చేయడం లేదా నమ్మించి మోసం చేయడం అని అర్థం. నమ్మకంగా ఉంటూ.. వెన్నుపోటు పొడుస్తుంటారు కొందరు. ముఖ్యంగా ఉద్యోగిని నమ్మి యజమాని అన్ని పనులు అప్పజెప్పుతుంటాడు. ఆర్థిక పరమైన లావాదేవీలు, ఆఫీసు వివరాలు, అవసరమైతే తన ఆస్తిపాస్తుల వివరాలు కూడా పంచుకుంటుంటాడు. అయితే కన్ను కుట్టిన ఉద్యోగి.. యజమానిని చీటింగ్ చేసి.. సొమ్ముతో ఉడాయించడం, తప్పుడు లెక్కలు చూపించడం, లేదంటే యజమాని నెగిటివిటీని ప్రచారం చేస్తుంటారు. ఉద్యోగం, జీతం ఇచ్చిన యజమానికి పంగనామాలు పెట్టాడో ఉద్యోగి.

నమ్మి.. ఓ వ్యక్తికి షోరూమ్ అప్పగిస్తే.. కోట్ల రూపాయలు మింగేశాడు. కోటో రెండు కోట్లే కాదూ.. 5కోట్లకు పైగా ఎసరు పెట్టాడు. ఆ కేటుగాడిది రంగారెడ్డి జిల్లా కూకట్ పల్లి. బెంగళూరులో ఉన్న డుకాటీ బైక్ షోరూంలో రాకేష్ అనే వ్యక్తి ఈ నేరానికి పాల్పడ్డాడు. బైక్ సేల్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్న రాకేష్.. వాహనాలను విక్రయించి.. ఆ డబ్బులు సంస్థకు అప్పగించలేదు.  కస్టమర్లు కొన్న వాహనాల వివరాలు ఆర్టీఓలో నమోదు కాకపోవడంతో పాటు తన ఉద్యోగానికి రాజీనామా చేయడంతో ఇతగాడి మోసం బయటకు వచ్చింది. 2019 జులై నుండి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు 21 బైకులను విక్రయించగా.. వాటి సొమ్ము రూ. 5.2 కోట్లు దోపిడీ చేసినట్లు తేలింది.

ఆడిట్ చేస్తుండగా.. తొమ్మిది డుకాటీ పానిగేల్, మూడు మల్టీ స్ట్రాడా, నాలుగు డయావెల్, రెండు మాన్ స్టర్, ఒక డెసర్ట్ ఎక్స్, స్క్రాంబర్, స్ట్రీట్ ఫైటర్ వి4 బైకులను రాకేష్ విక్రయించినట్లుగా తేలింది. అయితే వాటి వివరాలేమీ రికార్డుల్లో లేకపోవడంతో.. అప్పుడు కానీ అసలు విషయం బోధపడలేదు సంస్థ యజమానికి. ఒక్కో బైక్ రూ. 10 నుండి రూ. 40 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. కొంత సొమ్మును ఆఫీస్ ఫెసిలిటీ సప్లయర్స్ ఖాతాలో పేర్కొన్నాడు. మిగిలిన డబ్బును తన ఖాతాలో వేసుకున్నాడు. యజమానికి తెలియకుండా 5 కోట్లకు పైగా స్వాహా చేయడంతో స్టోర్ జనరల్ మేనేజర్ సీఎన్ మహేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అతడి కోసం వేట మొదలుపెట్టారు పోలీసులు.