iDreamPost
android-app
ios-app

Crime news: కోడ‌లి త‌ల న‌రికి, అత్త‌

  • Published Aug 11, 2022 | 5:53 PM Updated Updated Aug 11, 2022 | 5:53 PM
Crime news: కోడ‌లి త‌ల న‌రికి, అత్త‌

అన్న‌మ‌య్య జిల్లా కేంద్రం రాయ‌చోటిలోని కె.రామాపురంలో దారుణం. ప్లాన్ చేసి కోడిలిని త‌ల‌న‌రికి హ‌త్య చేసిన ఓ అత్త‌, ఆ త‌ల‌తోనే పోలీస్ స్టేష‌న్ కు వెళ్లి లొంగిపోయింది.

కె.రామాపురంలోఒని సుబ్బ‌మ్మ‌, సొంకోడ‌లు 35 ఏళ్ల వసుంధ‌ర‌ను భోజ‌నానికి పిలిచింది. అప్ప‌టికే ప్లాన్ వేసింది. ఆమె బంధువులుకూడా ఇంట్లో న‌క్కిఉన్నారు. వ‌సంధ‌ర రాగానే అంద‌రూ ఆమెను ప‌ట్టుకొని త‌ల‌న‌రికారు. సుబ్బ‌మ్మ ఆ కొడ‌లి త‌ల‌ను ప‌ట్టుకొని 6కిలోమీట‌ర్ల దూరంలోని రాయ‌చోటి టౌన్ పోలీస్ స్టేష‌న్ కు వెళ్లి లొంగిపోయింది. త‌ల‌ను చేతిలో ప‌ట్టుకొని వ‌స్తుంటే, జ‌నం భ‌య‌ప‌డ్డారు. ఆస్తి త‌గాదాల వ‌ల్లే కోడ‌లిని సుబ్బ‌మ్మ హత్య‌చేసి ఉండొచ్చ‌ని పోలీసులు అంటున్నారు.

కొడుకు కొన్నేళ్ల కిందట మరణించాడు. ఆ తర్వాత కోడలు మల్లికార్జున్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంద‌ని అత్త అనుమానిస్తోంది. ఈ విషయంలో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు.

చెప్పిన మాట కోడలు వినకపోవడంతో ఆమెను హ‌త్య‌చేయ‌డానికే అత్త సుబ్బమ్మ నిర్ణ‌యించుకుంది. ముందు కోడ‌లు వ‌సుంధ‌ర‌పై దాడి చేసింది. క‌త్తితో తల నరికింది. తలను కవర్లో పెట్టి నేరుగా పోలీస్ స్టేష‌న్‌కు వచ్చి లొంగిపోయింది. కోడ‌లిని తానే హ‌త్య చేశాన‌ని పోలీసుల‌కు చెప్పింది. కేసు న‌మోదు చేసిన పోలీసులు విచార‌ణ మొద‌లుపెట్టారు.

marsbahis girişjojobet