iDreamPost
android-app
ios-app

భర్త దుబాయ్‌లో .. భార్యకు మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం.. కట్ చేస్తే

  • Published Sep 16, 2023 | 2:38 PM Updated Updated Sep 16, 2023 | 2:38 PM
  • Published Sep 16, 2023 | 2:38 PMUpdated Sep 16, 2023 | 2:38 PM
భర్త దుబాయ్‌లో .. భార్యకు మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం.. కట్ చేస్తే

భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న భర్త.. అతడిని చంపేసి పరారయ్యాడు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. ఆ భర్త ఉంది దుబాయ్ లో. భార్య ఉంది తెలంగాణలోని వేముల వాడలో. తాను ఇండియాకు వచ్చిన సంగతి కూడా భార్యకు తెలియకుండా.. పక్కా ప్రణాళిక వేసుకుని ప్రియుడ్ని హతమార్చాడు. పోలీసులు పట్టుకునే లోగా విదేశాలకు చెక్కేశాడు. కేవలం పదంటే పది రోజుల్లోనే ప్లాన్ చేయడం.. దాన్ని అప్లై చేయడం జరిగిపోాయాయి. బంధువుల ఇంట్లో ఉండి ఈ మొత్తాన్ని అమలు చేశాడు. హత్య జరిగిన తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు అతడ్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. లుకౌట్ నోటీసులు ఇచ్చే లోపే అతడు దేశాన్ని దాటిపోయాడని తెలుస్తోంది.

వేముల వాడలోని చందుర్తి మండలం మల్యాలలో వివాహేతర సంబంధం కారణంగా పడిగెల నరేశ్ హత్యకు గురయ్యాడు. తన భార్యతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడన్న అనుమానంతో అతడిని హత్య చేశాడు మల్లేశం. ఈ నెల 3న దుబాయ్ నుండి ఇండియాకు వచ్చాడు మల్లేశం. భార్యకు తాను వచ్చిన విషయం చెప్పకుండా బంధువుల ఇంట్లో ఉన్నాడు. అక్కడే ఉండి పథకాన్ని రచించాడు. ఈ నెల 13న భార్య వద్దకు నరేశ్ వెళ్లడాన్ని చూసిన మల్లేశం.. అతడిని హత్య చేసి పారిపోయాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. వివరాలు తెలుసుకునే సరికి నిందితుడు జిల్లా దాటిపోయినట్లు సమాచారం. పోలీసులు లుకౌట్ నోటీసులు ఇచ్చే లోపే దుబాయ్ వెళ్లిపోయాడు. అయితే మల్లేశాన్ని హైదరాబాద్ ఎయిర్ పోర్టు వరకు ఎవరు తరలించారన్నది పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ హత్యలో నలుగురి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దుబాయ్ చేరుకున్న విషయాన్ని సవాల్‌గా తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet